Share News

Maharashtra Elections: వ్యూహం మార్చిన బీజేపీ... ఈసారి ఎక్కువ ర్యాలీల్లో ప్రచారం చేసేది మోదీ కాదు

ABN , Publish Date - Oct 30 , 2024 | 06:27 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ మహారాష్ట్ర, విదర్బ, ముంబై-కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, మరాఠ్వాడాల్లో 8 పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొనే బాధ్యత దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరి, చంద్రశేఖర్ బవాంకులేకి అప్పగించారు.

Maharashtra Elections: వ్యూహం మార్చిన బీజేపీ... ఈసారి ఎక్కువ ర్యాలీల్లో ప్రచారం చేసేది మోదీ కాదు

ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Assembly Elections) నామినేషన్ల గడువు మంగళవారం ముగియడంతో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంటోంది. మహాయుతి కూటమి, మహా వికాస్ అఘాడి తమ అగ్రనేతలను ప్రచారబరిలోకి దింపుతున్నాయి. 50కి పైగా బహిరంగ సభల్లో బీజేపీ అగ్రనేతలు పాల్గొనేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సహా పలువురు ప్రముఖులు ఈ బహిరంగ సభల్లో పాల్గొంటారు.

Diwali Celebrations: మోదీ బాటలో బలగాలతో డిఫెన్స్ ప్రముఖుల దీపావళి


మోదీ ఎక్కడ, ఎన్ని..?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెస్ట్ మహారాష్ట్ర, విదర్బ, ముంబై-కొంకణ్, నార్త్ మహారాష్ట్ర, మరాఠ్వాడాల్లో 8 పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొంటారు. ఎక్కువ పబ్లిక్ మీటింగ్స్‌లో పాల్గొనే బాధ్యత దేవేంద్ర ఫడ్నవిస్, నితిన్ గడ్కరి, చంద్రశేఖర్ బవాంకులేకి అప్పగించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వివిధ జిల్లాల్లో 15 ర్యాలీల్లో పాల్గొంటారు. ఆయనతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల మఖ్యమంత్రులు సైతం మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. వీటితో పాటు స్థానిక నేతలు సైతం పలు ర్యాలీలు నిర్వహించనున్నారు.


అత్యధిక ర్యాలీల నిర్వహణ ఫడ్నవిస్‌కే

పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, కేంద్రం మంత్రి అమిత్‌షా 20 ర్యాలీలు, నితిన్ గడ్కరి 40 ర్యాలీలు నిర్వహించనుండగా, దేవేంద్ర ఫడ్నవిస్ 50 ర్యాలీలు నిర్వహిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బవాంకులే 40 ర్యాలీలు నిర్వహిస్తారు.


హర్యానా తరహాలోనే..

హర్యానా ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే మహారాష్ట్ర ఎన్నికల్లోనూ అనుసరించాలని బీజేపీ వ్యూహంగా ఉంది. హర్యానాలో మోదీ, అమిత్‌షా కొన్ని ర్యాలీల్లోనే పాల్గొని ప్రచారం సాగించారు. ఎక్కువ ర్యాలీలు స్థానిక నేతలే నిర్వహించారు. హర్యానాలో కమలనాథుల వ్యూహం ఫలించింది. ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లలో గెలిచి, వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనతను బీజేపీ దక్కించుకుంది.


మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఒకే విడతలో నవంబర్ 20న జరుగనున్నాయి. నవంబర్ 23న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు. ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన, అజిత్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీతో కలిసి బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉంది. కాగా, మహారాష్ట్రలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు రాబట్టిన 'మహా వికాస్ అఘాడి' ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయనే నమ్మకంతో ఉంది.


ఇవి కూడా చదవండి..

Maharashtra: బరిలో భారీగా అభ్యర్థులు

Priyanka Gandhi: 30 ఏళ్లుగా హౌస్‌వైఫ్‌గా ఉన్నా, నా వాయిస్ చాలా పెద్దది

Arvind Kejriwal: దీపావళికి ఒకరోజు ముందు కేజ్రీవాల్ షాక్

For National News And Telugu News...

Updated Date - Oct 30 , 2024 | 06:31 PM