Share News

BJP meets Ec: ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తే సహించొద్దు.. ఈసీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం

ABN , Publish Date - Jun 02 , 2024 | 08:57 PM

లోక్‌సభ ఎన్నికల కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ విజ్ఞాపనలతో ఎన్నికల కమిషన్‌ ను కలుస్తు్న్నాయి. 'ఇండియా' కూటమి ప్రతినిధిలు ఆదివారంనాడు ఈసీని కలిసి పలు విజ్ఞాపనలు చేయగా, ఆ కొద్ది సేపటికే బీజేపీ ప్రతినిధుల బృందం ఈసీని కలిసింది.

BJP meets Ec: ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తే సహించొద్దు.. ఈసీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల కీలక ఘట్టమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ విజ్ఞాపనలతో ఎన్నికల కమిషన్‌ (Election Commission)ను కలుస్తున్నాయి. 'ఇండియా' కూటమి ప్రతినిధిలు ఆదివారంనాడు ఈసీని కలిసి పలు విజ్ఞాపనలు చేయగా, ఆ కొద్ది సేపటికే బీజేపీ (BJP) ప్రతినిధుల బృందం ఈసీని కలిసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సారథ్యంలోని బీజేపీ ప్రతినిధుల బృందంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్, సంజయ్ మయూఖ్, ఓంప్రకాశ్ ఉన్నారు.


కాగా, ఈసీతో సమావేశానంతరం మీడియోతో పీయూష్ గోయెల్ మాట్లాడుతూ, భారతదేశ సమున్నత ఎన్నికల ప్రక్రియ సమగ్రతను బలహీన పరచేందుకు కాంగ్రెస్, 'ఇండియా' కూటమి నేతలు పదేపదే ప్రయత్నాలు చేస్తుండటంతో తాము ఈసీని కలిసినట్టు చెప్పారు. భారత ప్రజాస్వామిక వ్యవస్థపై కాంగ్రెస్ దాడి చేస్తోందని, ఈ ఎన్నికలు పూర్తిగా పారదర్శకంగా, మెరుగైన రీతిలో జరిగాయని అన్నారు. దేశంలోని బలమైన నేతలు, ఎదుగుతున్న దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని విపక్షాలు దాడులు చేస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఒకవేళ వారు గెలిస్తే సత్యమేవ జయతే అంటారని, లేకుంటే ప్రశ్నలు లేవెనత్తుతారని తప్పుపట్టారు.

LokSabha Elections: ఈసీని కలిసిన ఇండియా కూటమి నేతలు


ఈసీ దృష్టికి ప్రధానంగా నాలుగు అంశాలు తీసుకువచ్చినట్టు గోయెల్ తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనే ప్రతి అధికారి ఈసీ ప్రోటోకాల్‌ను తూ.చ. తప్పకుండా పాటించేలా చూడాలని, కౌంటింగ్, ఎన్నికల ఫలితాలు ప్రకటించే సమయంలో ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలక్కుండా కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని, ఎన్నికల ప్రక్రియను ఒక పద్ధతి ప్రకారం బలమైన పరిచేందుకు ప్రయత్నించే శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఎన్నికల ప్రక్రియ సమగ్రతను వివరిస్తూ ప్రజాస్వామ్య ప్రక్రియకు దెబ్బతీసే ఎలాంటి ప్రయత్నాలు సహించేది లేదని బహిరంగ ప్రకటన చేయాలని ఈసీని కోరినట్టు పీయూష్ గోయెల్ చెప్పారు.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 08:57 PM