Share News

Exit Polls 2024: అక్కడ కూడా ఎన్డీఏదే హవా.. వారి ప్లాన్స్ గల్లంతు

ABN , Publish Date - Jun 01 , 2024 | 09:21 PM

సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే ఎగ్జిట్ పోల్ సర్వేలు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకి అనుకూలంగా తీర్పునిచ్చాయి. మూడోసారి కూడా ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టారని..

Exit Polls 2024: అక్కడ కూడా ఎన్డీఏదే హవా.. వారి ప్లాన్స్ గల్లంతు

సెమీ ఫైనల్స్‌గా చెప్పుకునే ఎగ్జిట్ పోల్ సర్వేలు (Exit Poll Results) బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏకి (NDA) అనుకూలంగా తీర్పునిచ్చాయి. మూడోసారి కూడా ఎన్డీఏకే ప్రజలు పట్టం కట్టారని, నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రధాని పీఠం ఎక్కబోతున్నారని సర్వేలు ప్రకటించాయి. గతంతో పోలిస్తే.. ఈసారి ఎన్డీఏకి భారీ మెజారిటీ రాబోతోందని, అత్యధిక స్థానాల్లో విజయఢంకా మోగిస్తుందని చెప్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ (Delhi) బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాలు పేర్కొంటున్నాయి. 2019 తరహాలోనే.. అన్ని స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.


ఢిల్లీలో బీజేపీ 6-7 సీట్లు గెలుచుకోవడం తథ్యమని, ఇండియా కూటమి ఖాతా తెరవకపోవచ్చని ‘యాక్సిస్ మై ఇండియా’ అంచనా వేసింది. ఒకవేళ అదృష్టం కలిసి వస్తే.. ఒక్క సీటు గెలిచే ఛాన్స్ ఉందని ఆ సర్వే తెలిపింది. టుడేస్ చాణక్య అయితే.. ఢిల్లీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పేర్కొంది. నిజానికి.. ఈసారి ఢిల్లీలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ చేతులు కలిపాయి. ముఖ్యంగా.. బీజేపీకి వ్యతిరేకంగా ఆప్ విస్తృతస్థాయిలో ప్రచారం చేసి, పది గ్యారెంటీలను కూడా ప్రకటించింది. కానీ.. ఎన్ని వ్యూహాలు వేసినా అవి బెడిసికొట్టాయని, బీజేపీ గెలుపుని ‘ఇండియా’ కూటమి అడ్డుకోలేకపోయిందని సర్వేలు చెప్తున్నాయి.


ఇతర రాష్ట్రాల విషయానికొస్తే.. త్రిపురలో ఉన్న రెండు స్థానాల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని ‘యాక్సిస్ మై ఇండియా’ సర్వే అంచనా వేసింది. అస్సాం, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్, బిహార్, జార్ఖండ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్డీఏదే హవా అని ఈ సర్వే చెప్తోంది. ఒక్క తమిళనాడులో మాత్రమే ఇండియా కూటమి అత్యధిక స్థానాలను సొంతం చేసుకుంటుందని, పంజాబ్‌లో కాంగ్రెస్‌కు 7-9 స్థానాలు రావొచ్చని వెల్లడించింది. మరి.. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు నిజమవుతాయో? లేదా? అనేది జూన్ 4వ తేదీన తేలిపోనుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jun 01 , 2024 | 09:26 PM