Share News

BJP MLA: ఆ పథకాన్ని రాజకీయం చేయొద్దు

ABN , Publish Date - Nov 29 , 2024 | 10:07 AM

ఎంతో ఉన్నతమైన ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పాడుచేయొద్దని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోయంబత్తూరు తూర్పు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌(Coimbatore East MLA Vanathi Srinivasan) ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విఙ్ఞప్తి చేశారు.

BJP MLA: ఆ పథకాన్ని రాజకీయం చేయొద్దు

- బీజేపీ ఎమ్మెల్యే వానతి

చెన్నై: ఎంతో ఉన్నతమైన ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన విశ్వకర్మ పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం పాడుచేయొద్దని బీజేపీ జాతీయ మహిళా విభాగం అధ్యక్షురాలు, కోయంబత్తూరు తూర్పు ఎమ్మెల్యే వానతి శ్రీనివాసన్‌(Coimbatore East MLA Vanathi Srinivasan) ముఖ్యమంత్రి స్టాలిన్‌కు విఙ్ఞప్తి చేశారు. ఈ విశ్వకర్మ పథకాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని సీఎం స్టాలిన్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

ఈ వార్తను కూడా చదవండి: Maharashtra CM: ఎట్టకేలకు మహారాష్ట్ర కొత్త సీఎం ఎంపిక.. ఉప ముఖ్యమంత్రులుగా..


nani1.jpg

దీనిపై వానతి శ్రీనివాసన్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కులవృత్తులను బలోపేతం చేస్తుందన్నారు. అలాంటి పథకాన్ని తమిళనాడులో అమలు చేయబోమని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖకు సీఎం స్టాలిన్‌(CM Stalin) లేఖ రాయడం దురదృష్టకరమన్నారు. సంప్రదాయ కళాకారులు, చేనేత కార్మికుల నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు, తద్వారా వారి జీవనోపాధిని పెంచేందుకు ఈ పథకాన్ని ప్రధాని మోదీ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు.


ఈ పథకం కింద 18 సంప్రదాయ కులవృత్తులు, చేతివృత్తులకు చెందిన వారు లబ్ధి పొందుతారని వెల్లడించారు. తమిళనాడులో కూడా ఈ పథకంలో చేరేందుకు లక్షలాది మంది కళాకారులు ఆసక్తి చూపుతుంటే డీఎంకే ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయబోమని చెప్పడం బాధాకరంగా ఉందదని, రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మంచి పథకాన్ని అడ్డుకోవద్దని వానతి శ్రీనివాసన్‌ విఙ్ఞప్తి చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: తెరచాటు ఒప్పందం..

ఈవార్తను కూడా చదవండి: Panchayat Elections: సంక్రాంతికి పంచాయతీ భేరి!

ఈవార్తను కూడా చదవండి: Warangal: వచ్చే ఆగస్టుకల్లా కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తి

ఈవార్తను కూడా చదవండి: Komati Reddy: హరీశ్‌, కేటీఆర్‌లది నా స్థాయి కాదు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 29 , 2024 | 10:07 AM