BJP state president: రామాలయ నిధుల సేకరణలో రాష్ట్రానిది మూడో స్థానం
ABN , Publish Date - Jan 21 , 2024 | 01:07 PM
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు అందజేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు.
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై
పెరంబూర్(చెన్నై): అయోధ్యలో రామాలయం నిర్మాణానికి నిధులు అందజేసిన రాష్ట్రాల్లో తమిళనాడు మూడో స్థానంలో ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) తెలిపారు. స్థానిక తిరువాన్మియూర్‌లో ఉన్న పాంబన్ స్వామిగళ్ ఆలయంలో శుక్రవారం అన్నామలై స్వచ్ఛ తీర్థ్ పనులు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రధాని మోదీ(Prime Minister Modi) ఆదేశాలతో ఈనెల 22వ తేది వరకు బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మసీదులు అని మొత్తం 500 ప్రార్థనా స్థలాల్లో స్వచ్ఛ తీర్థ్ పనులు చేపట్టనున్నామన్నారు. స్వచ్ఛ నగరాల్లో రాష్ట్రం వెనుకంజలో ఉందన్నారు. గవర్నర్‌పై నిందలు మోపడం డీఎంకే ప్రభుత్వానికి అలవాటుగా మారిందన్నారు. ఎలాంటి అవినీతికి పాల్పడని సేలం పెరియార్ వర్శిటీ ఉపకులపతి జగన్నాథన్ ఇంట్లో దాడులు చేయించి, ఆయన్ను అరెస్ట్ చేశారని ఆరోపించారు. 32 ఏళ్ల డీఎంకే పాలనలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారన్నారు.