Share News

దేశాన్ని అస్థిరపర్చే కుట్ర!

ABN , Publish Date - Dec 10 , 2024 | 03:53 AM

పార్లమెంట్‌ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్‌ సోరోస్‌’ అస్త్రం దొరికింది.

దేశాన్ని అస్థిరపర్చే కుట్ర!

విదేశీ శక్తుల ‘సాధనం’గా కాంగ్రెస్‌.. సోరోస్‌ నిధులిస్తున్న సంస్థతో సోనియాకు సంబంధాలు

బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపణలు

తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే

రాజ్యసభలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం

న్యూఢిల్లీ, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పార్లమెంట్‌ సమావేశాల్లో అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడుతున్న నేపథ్యంలో అధికార బీజేపీకి ‘జార్జ్‌ సోరోస్‌’ అస్త్రం దొరికింది. అమెరికన్‌-హంగేరియన్‌ వ్యాపారవేత్త జార్జ్‌ సోరోస్‌ ఫౌండేషన్‌ నిధులు సమకూరుస్తున్న సంస్థతో కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీకి సంబంధాలు ఉన్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంటులో చర్చించాలనే డిమాండ్‌ను తెరపైకి తెచ్చింది. బీజేపీ ఆరోపణలపై సోమవారం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా; రాజ్యసభలో ప్రతిపక్ష నేత ఖర్గే మధ్య మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్‌ పార్టీ విదేశీ శక్తుల చేతుల్లో ‘సాధనం’గా వ్యవహరిస్తోందని నడ్డా ఆరోపించారు. సోరో్‌సతో కాంగ్రె్‌సకు సంబంధాలు ఉన్నాయని, భారత్‌ను అస్థిరపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దీనిపై ఖర్గే తీవ్రంగా స్పందించారు. నడ్డా అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. సమస్యల నుంచి ప్రజల నుంచి దృష్టి మరల్చేందుకే బీజేపీ నిరాధార ఆరోపణలు చేస్తోందన్నారు. ఈ క్రమంలో నడ్డా, ఖర్గేలను తన చాంబర్‌కు రావాలని ధన్‌ఖడ్‌ ఆదేశించారు. విపక్ష పార్టీల ఎంపీలు తాము లేవనెత్తిన అంశాలపై చర్చించాలని పట్టుబట్టడంతో సభ వాయిదాల పర్వంలో నడిచింది. రెండోసారి వాయిదా అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత నడ్డా మాట్లాడుతూ.. ఫోరమ్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ లీడర్స్‌ ఇన్‌ ఆసియా ఫసిఫిక్‌ ఫౌండేషన్‌కు సోరోస్‌ సంస్థ నిధులు సమకూరుస్తోందన్నారు. ఆ ఫౌండేషన్‌కు సోనియా సహ అధ్యక్షురాలిగా ఉన్నారని చెప్పారు.

ఇది చాలా తీవ్రమైన అంశమన్నారు. ‘ఇది భారతదేశ ప్రతిష్ఠను దెబ్బతీస్తుంది. జాతీయ భద్రతపై ఆందోళనను పెంచుతోంది. దేశ భద్రతతో కాంగ్రెస్‌ ఆటలు ఆడుకుంటోంది. అందుకే ఈ అంశంపై చర్చించాలని కోరుకుంటున్నాం’ అని పేర్కొన్నారు. దీంతో సోనియా, సోరోస్‌ సంస్థ సంబంధాలపై వెంటనే చర్చ చేపట్టాలని కోరుతూ బీజేపీ ఎంపీలు నినాదాలు చేశారు. బీజేపీ సభ్యుల డిమాండ్‌పై కాంగ్రెస్‌ ఎంపీలు ఖర్గే, జైరాం రమేశ్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని లేవనెత్తేందుకు బీజేపీ ఎంపీలను ఎలా అనుమతించారని చైర్మన్‌ను అడిగారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడడం వారి ప్రతిష్ఠను దిగజార్చడమేనన్నారు. చైర్మన్‌ ధన్‌ఖడ్‌ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి రిజిజు మాట్లాడుతూ.. సోనియా-సోరోస్‌ మధ్య సంబంఽధాలు దేశ భద్రతకు ఆందోళనకరమన్నారు. కాగా,సభలో చైర్మన్‌ ధన్‌ఖడ్‌, కాంగ్రెస్‌ ఎంపీ జైరాంరమేశ్‌ మధ్య వాగ్వాదం జరిగింది. చైర్మన్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని రమేశ్‌ ఆరోపించారు. గందరగోళ పరిస్థితులతో చైర్మన్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

న్నారు.


లోక్‌సభలోనూ గందరగోళం..

లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదానీ వ్యవహారంపై జేపీసీతో విచారణ జరపాలని, మణిపూర్‌ అంశం, శంభులో రైతులపై రబ్బర్‌ బుల్లెట్లతో దాడి వంటి అంశాలపై చర్చ జరపాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ కొద్దిసేపటికే వాయిదా పడింది. మళ్లీ సభ ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలతో హోరెత్తించాయి. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ తెలిపారు. మళ్లీ అదే పరిస్థితి ఉండడంతో 3 గంటలకు వాయిదా వేశారు. ఒకవైపు ప్రతిపక్షాల ఆందోళన జరుగుతుండగానే, మరోవైపు బీజేపీ ఎంపీలు సోనియా-సోరోస్‌ అంశంపై చర్చించాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్‌ సభను మంగళవారానికి వాయిదా వేశారు.

‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ బిల్లుపై జేపీసీ?

పార్లమెంటు, అసెంబ్లీలకు ఒకేసారి ఎలక్షన్లు నిర్వహించే ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ విధానంపై ముందుకెళ్లాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లును ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు తెలిపాయి. ఏకాభిప్రాయ సాధన ద్వారానే ఈ బిల్లును ఆమోదింపజేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు విస్తృతంగా చర్చలు జరిపేందుకు వీలుగా సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని కూడా నియమించే అవకాశం ఉంది.


ధన్‌ఖడ్‌పై అవిశ్వాసం?

రాజ్యసభ చైర్మన్‌, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైనట్లు తెలిసింది. సదరు నోటీసుపై విపక్ష ‘ఇండీ’ కూటమి ఎంపీలు సంతకాలు కూడా చేసినట్లు సమాచారం. ధన్‌ఖడ్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గత ఆగస్టులోనే అవిశ్వాసం పెట్టాలనుకున్నారు. అయితే మరో అవకాశం ఇవ్వాలని ఆగారు. ఇప్పుడు అవిశ్వాసం పెట్టక తప్పడం లేదని కాంగ్రెస్‌ వర్గాలు అంటున్నాయి. అవిశ్వాసానికి టీఎంసీ, ఆప్‌, ఎస్పీ, సీపీఎం, సీపీఐ సహా పలు పార్టీలకు చెందిన 70 మంది మద్దతు తెలిపినట్లు తెలిసింది.

రాహుల్‌ గాంధీకి అదానీ, మోదీ ఇంటర్వ్యూ!

అదానీపై పార్లమెంటులో చర్చ కోసం కాంగ్రెస్‌ వినూత్న నిరసన ప్రదర్శన

అదానీపై అమెరికా చేసిన అవినీతి ఆరోపణలపై పార్లమెంటులో చర్చ కోసం పట్టుబడుతున్న కాంగ్రెస్‌ పార్టీ సోమవారం వినూత్న రీతిలో నిరసన తెలిపింది. అదానీ, మోదీ మాస్కులు ధరించి పార్లమెంటుకు వచ్చిన కాంగ్రెస్‌ ఎంపీలు మాణిక్కం ఠాగూర్‌, సప్తగిరి శంకర్‌ను విపక్ష నేత రాహుల్‌గాంధీ ఇంటర్వ్యూ చేశారు. ‘మీ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి’ అని వారిని ప్రశ్నించారు. దానికి.. ‘ఏదైనా మేమిద్దరం కలిసే చేస్తాం. ఎన్నో ఏళ్ల బంధం మాది’ అని బదులిచ్చారు. అదానీ మాస్కు వేసుకున్న ఠాగూర్‌.. ‘నేనేది చెప్తే ఆయన అదే చేస్తారు. ఎయిర్‌పోర్టు అయినా పోర్టు అయినా.. ఏది అడిగితే అది ఇస్తారు’ అని మోదీ మాస్కు వేసుకున్న శంకర్‌ను ఉద్దేశించి అన్నారు. అయితే, తర్వాత ఏం అడగబోతున్నారని రాహుల్‌ ప్రశ్నించగా.. ‘ఈ సాయంత్రమే మాకు మీటింగ్‌ ఉంది’ అని ఠాగూర్‌ అ

Updated Date - Dec 10 , 2024 | 03:53 AM