Share News

BJP: పార్టీ ఎంతో ఇచ్చింది.. కొంతైనా తిరిగిచ్చేద్దాం

ABN , Publish Date - Oct 26 , 2024 | 12:46 PM

పార్టీ మనకు ఎంతో చేసిందనీ, పార్టీకి కొంతైనా తిరిగి ఇచ్చేద్దామని పార్టీ నేతలకు, శ్రేణులకు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తమిళనాడు, కర్ణాటక జాతీయ కో-ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి(Dr. Ponguleti Sudhakar Reddy) పిలుపునిచ్చారు. అంజికరైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ‘తమిళనాడు బీజేపీ సంఘటన్‌ పర్వ్‌’ పేరుతో ఒక వర్క్‌షాపు నిర్వహించారు.

BJP: పార్టీ ఎంతో ఇచ్చింది.. కొంతైనా తిరిగిచ్చేద్దాం

- డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి పిలుపు

చెన్నై: పార్టీ మనకు ఎంతో చేసిందనీ, పార్టీకి కొంతైనా తిరిగి ఇచ్చేద్దామని పార్టీ నేతలకు, శ్రేణులకు భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) తమిళనాడు, కర్ణాటక జాతీయ కో-ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి(Dr. Ponguleti Sudhakar Reddy) పిలుపునిచ్చారు. అంజికరైలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం ‘తమిళనాడు బీజేపీ సంఘటన్‌ పర్వ్‌’ పేరుతో ఒక వర్క్‌షాపు నిర్వహించారు. ఆ పార్టీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడు, టీఎన్‌బీజేపీ కోఆర్డినేషన్‌ కమిటీ కన్వీనర్‌ హెచ్‌.రాజా ఈ వర్క్‌షాపు ఏర్పాటు చేశారు. ఇందులో డాక్టర్‌ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యదర్శి అర్వింద్‌ మీనన్‌, తమిళనాడు సీనియర్‌ నేతలు డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, కేశవ వినాయకన్‌, ఎం.చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Former CM: నో డౌట్.. 2026లో అధికారం మాదే!


nani3.2.jpg

ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే, పార్టీ బలోపేతం కోసం సినీ నటి నమిత, పార్టీ నేతలు సెంథిల్‌, హంసవర్థన్‌లకు క్రియాశీలక సభ్యత్వ దరఖాస్తు అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ పొంగులేటి మాట్లాడుతూ, ప్రతి కార్యకర్తకు పార్టీ ఎంతో ఇచ్చిందని, ఇపుడు మనం క్రియాశీలక సభ్యత్వం పెంచడం ద్వారా పార్టీకి ఎంతోకొంత ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీలో గ్రూపు రాజకీయాలకు, ముఠా తగాదాలకు తావులేదని, పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు.


....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.....................................................................

Hero Vijay: టీవీకే మహానాడుకు సర్వంసిద్ధం

- 101 అడుగుల స్తంభంపై పతాకావిష్కరణ

- రెండు లక్షల మంది వస్తారని అంచనా

చెన్నై: అగ్రహీరో విజయ్‌(Hero Vijay) సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం (టీవీఏ) తొలి మహానాడుకు సర్వంసిద్ధమయ్యాయి. మహానాడు ప్రారంభోత్సవానికి ముందు పార్టీ అధినేత విజయ్‌ 101 అడుగుల స్తంభానికి పార్టీ జెండా ఆవిష్కరించనున్నారు. ఈ మహానాడు ప్రాంగణంలో అనేక మహనీయుల కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇందులో ఇద్దరు మహిళా స్వాతంత్య్ర సమరయోధులకు కూడా స్థానం కల్పించారు.

nani4.jpg


అలాగే, మహానాడుకు రెండు లక్షల మంది టీవీకే కార్యకర్తలు, విజయ్‌ అభిమానులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నెల 27న జరిగే మహానాడు కోసం 170 అడుగుల పొడవు, 65 అడుగుల వెడల్పుతో వేదిక నిర్మించారు. 85 ఎకరాల విస్తీర్ణంలో మహానాడు కోసం ఏర్పాట్లు చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా స్థలాన్ని సిద్ధం చేశారు. మహానాడుకు వచ్చే కార్యకర్తలు కూర్చునేందుకు 55 వేల కుర్చీలను వేస్తునన్నారు. అయితే, ఈ మహానాడుకు రెండు లక్షల మంది వస్తారని టీవీకే పార్టీ నేతలు, మహానాడు నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.


మహానాడు ప్రాంగంలో 60 అడుగుల ఎత్తులో కామరాజర్‌, అంబేడ్కర్‌, పెరియార్‌తో పాటు పార్టీ అధ్యక్షుడు విజయ్‌ కటౌట్లను మొదట ఏర్పాటుచేయగా, శుక్రవారం ఇద్దరు మహిళా స్వాతంత్య్ర సమరయోధులైన వీర తంగైవేలు నాచ్చియార్‌, అంజలై అమ్మాళ్‌ కటౌట్లను కూడా పెట్టారు. వీటితోపాటు చేర, చోళ, పాండ్య రాజుల చిత్రాలను కూడా ఉంచారు. 101 అడుగుల దిమ్మెలో ఎగురవేసే పార్టీ పతాకం పదేళ్ళపాటు ఎగురుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ జెండాను 20 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవుతో తయారు చేశారు. మహానాడు జరిగే ప్రాంగణంలో 700 సీసీ కెమెరాలను అమర్చారు. మహానాడుకు వచ్చే కార్యకర్తల కోసం 300 మొబైల్‌ టాయిలెట్లను సిద్ధంగా ఉంచారు.


ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కేటీఆర్‌లో వణుకు మొదలైంది: ఆది శ్రీనివాస్‌

ఈవార్తను కూడా చదవండి: Winter Weather: వణికిస్తున్న చలి పులి..!

ఈవార్తను కూడా చదవండి: jaggareddy: ఓటమి అనేక పాటలు నేర్పిస్తుంది: జగ్గారెడ్డి

ఈవార్తను కూడా చదవండి: Kidnap: సంగారెడ్డి ఆస్పత్రిలో కిడ్నాప్.. సంచలనం రేపుతున్న ఘటన..

Read Latest Telangana News and National News

Updated Date - Oct 26 , 2024 | 12:47 PM