Lok Sabha polls 2024: బీజేపీ ఉన్నంతవరకూ రిజర్వేషన్లకు ఢోకా లేదు: అమిత్‌షా
ABN , Publish Date - Apr 14 , 2024 | 08:46 PM
రిజర్వేషన్ల విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా భరోసా ఇచ్చారు. రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేందుకు బీజేపీ ఒక్కనాటికి అనుమతించదని, కాంగ్రెస్ ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత వరకూ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది రాదని, కాంగ్రెస్ ఆ పని చేసినా అనుమతించేది లేదని అన్నారు.
ఖైరాగఢ్: రిజర్వేషన్ల (Reservations) విషయంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) భరోసా ఇచ్చారు. రిజర్వేషన్లకు స్వస్తి చెప్పేందుకు బీజేపీ ఒక్కనాటికి అనుమతించదని, కాంగ్రెస్ ప్రయత్నించినా అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు. బీజేపీ రాజకీయాల్లో ఉన్నంత వరకూ రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బంది రాదని, కాంగ్రెస్ ఆ పని చేసినా అనుమతించేది లేదని అన్నారు. అబద్ధాలు చెప్పడమే కాంగ్రెస్ పనిగా పెట్టుకుందని ఛత్తీస్‌గఢ్‌లోని ఖైరాగఢ్‌లో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల సభలో అమిత్‌షా స్పష్టం చేశారు. బీజేపీ 400కు పైగా సీట్లు గెలిస్తే రిజర్వేషన్లు తొలిగిస్తుందనే అబద్ధపు ప్రచారం బీజేపీ చేస్తోందని, బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా, మెజారిటీ ఉన్నా తాము ఆ పని చేయలేదని గుర్తుచేశారు. తమ అధికారంతో 370వ అధికరణను రద్దు చేశామని, తలాఖ్‌కు స్వస్తి చెప్పామని అన్నారు.
Rajanth Vs Tejashwi: చేపలు, ఏనుగులు, గుర్రాలను కూడా తినండి.. రాజ్‌నాథ్ పవర్ పంచ్
బీజేపీ బటన్ శబ్దం లండన్‌కి వినిపించాలి..
ఛత్తీస్‌గఢ్‌లోని గత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటుచేసుకున్న 'మహదేవ్ బెట్టింగ్ యాప్' కుంభకోణంపై అమిత్‌షా మాట్లాడుతూ, ఓటర్లు తమ ఆగ్రహాన్ని ఓటింగ్‌తో చాటిచెప్పాలని, కమలం (బీజేపీ గుర్తు) బటన్‌ను నొక్కి ఆ శబ్దం ఇటలీకి వినిపించేలా చేయాలన్నారు. ఖైరాగఢ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ పోటీ చేస్తుండగా, ఆయనపై సంతోష్ పాండేను తమ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది.