Share News

BJP: కొత్త అధ్యక్షుడి కోసం కమలనాధులు కసరత్తు.. త్వరలో ఢిల్లీలో కీలక బేటీ

ABN , Publish Date - Nov 08 , 2024 | 08:25 PM

వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతోపాటు పలు అసెంబ్లీలకు ఉప ఎన్నికలు నవంబర్ 20తో ముగియనున్నాయి. వాటి ఫలితాలు నవంబర్ 23న వెలువడనున్నాయి. దీంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎంపికపై ఆ పార్టీ దృష్టి సారించింది.

BJP: కొత్త అధ్యక్షుడి కోసం కమలనాధులు కసరత్తు.. త్వరలో ఢిల్లీలో కీలక బేటీ

మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ మాసాంతంలో ముగియనున్నాయి. ఆ వెంటనే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియపై ఆ పార్టీ అగ్రనేతలు కసరత్తు చేస్తున్నారు. అందులోభాగంగా నవంబర్ 22వ తేదీన బీజేపీ కీలక సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశానికి జాతీయ పదాధికారులతోపాటు అన్ని రాష్ట్రాల్లోని పార్టీ అధ్యక్షులు, ఇతర అగ్రనేతలు సైతం హాజరుకానున్నారు. ఈ సమావేశంలో హోం మంత్రి అమిత్ షా కూడా పాల్గొనున్నారని సమాచారం. ఇక పార్టీలోని ఎన్నికల అధికారి కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

Viral News: అద్భుతం.. చంపి బొంద పెట్టినా లేచి వచ్చింది.. దీనివల్లే సాధ్యమైందట..


జాతీయ ఎన్నికల అధికారి, ఎంపీ కె. లక్ష్మణ్‌, పార్టీలో అధ్యక్ష ఎన్నికల కోసం నియమించబడిన ముగ్గురు సహ-ఎన్నికల అధికారులు, అన్ని రాష్ట్రాల్లో నియమించబడిన రాష్ట్ర ఎన్నికల అధికారులతోపాటు సహా-అధికారులు ఈ సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. అలాగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా క్రియాశీల సభ్యత్వ అధిపతులను సైతం ఆహ్వానించారు.

Uttar Pradesh : సమాజవాదీ పార్టీపై సీఎం యోగి విసుర్లు


ఇక జాతీయ అధ్యక్షుడి ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల అధికారి కె లక్ష్మణ్ జాతీయ అప్పీల్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి రాధామోహన్ సింగ్ కన్వీనర్‌గా, ముగ్గురు సీనియర్ బీజేపీ నేతలు విజయపాల్ సింగ్ తోమర్, సంజయ్ భాటియా, గజేంద్ర పటేల్‌లను నేషనల్ అప్పీల్ కమిటీ కో-కన్వీనర్‌లుగా నియమించారు. బీజేపీ అధ్యక్షుడి ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఈ అప్పీల్ కమిటీ విధులు నిర్వహిస్తుంది.

Also Read: Hyderabad: డ్రగ్స్ కేసులో పట్టుబడిన మహిళ: రంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పు


గత మంగళవారం జరిగిన భేటీలో పార్టీ అధ్యక్ష పదవికి జరగాల్సిన ఎన్నికల వేగాన్ని పెంచాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను అమిత్ షా కోరారు. ఈ భేటీలో బీజేపీ అర్గనైజింగ్ సెక్రటరీ బీఎల్ సంతోష్ సైతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రాల వారీగా సంస్థాగత ఎన్నికల ప్రగతికి సంబంధించిన నివేదికను కేంద్ర మంతి అమిత్ షాకు ఆయన అందజేశారు.

Also Read: రిటైర్ కానున్న సీజేఐ డీవై చంద్రచూడ్.. అనంతరం కోర్టులో..?


ఇదే సమావేశంలో నవంబర్ 22వ తేదీన భారీ బేటీ నిర్వహించి.. పార్టీ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియను వేగవంతం చేయాలని పార్టీ సీనియర్లకు ఈ సందర్భంగా అమిత్ షా సూచించారు. అలాగే జాతీయ అప్పీల్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు. జనవరి మూడో వారంలోపు బీజేపీ నూతన అధ్యక్షుడిని ఎన్నిక ప్రక్రియ పూర్తవుతుంది. అంటే జనవరి 15వ తేదీ అనంతరం ఎప్పుడైనా బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడు ఎవరనేది తెలనుంది.

Also Read: కమలా పండు తినడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?

For National News And Telugu News...

Updated Date - Nov 08 , 2024 | 08:27 PM