Budget 2024: విద్య, ఉపాధికి బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు..
ABN , Publish Date - Jul 23 , 2024 | 12:07 PM
Budget 2024: కేంద్ర బడ్జెట్2024-25లో ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), మధ్యతరగతి ప్రజలుపై ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..
న్యూఢిల్లీ, జులై 23: కేంద్ర బడ్జెట్2024-25లో ఉపాధి, నైపుణ్యం, MSMEలు (మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్‌ప్రైజెస్), మధ్యతరగతి ప్రజలుపై ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మంగళవారం నాడు పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆమె.. బడ్జెట్‌లోని ప్రధానాంశాలను వివరించారు.
దేశ వ్యాప్తంగా 4.1 కోట్ల మంది యువతీ, యువకులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ఈ రంగాలపై దృష్టి సారిస్తుందని సీతారామన్ చెప్పారు. ఈ రంగాలలో పథకాలు, చర్యలు - ప్రస్తుతం ఉన్నవి, ప్రకటించబోయేవి అన్నింటికి కలిపి ఐదు సంవత్సరాల వ్యవధిలో రూ. 2 లక్షల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు.
రానున్న ఐదేళ్లలో 20 లక్షలమందికి నైపుణ్యాభివృద్ధి సంస్థల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలకు అవసరమైన రుణ సదుపాయం కల్పిస్తామన్నారు. భారతీయ విద్యాసంస్థల్లో చదువుకునే విద్యార్థులకు 3 శాతం వడ్డీ రాయితీ కల్పిస్తామన్నారు. స్వయం ఉపాధి పొందుతున్న చేతివృత్తి మహిళలకు రుణ సాయం పెంచుతున్నట్లు ప్రకటించారు.
చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఎంఎస్‌ఎంఈ క్లస్టర్లు నూతన సిడ్‌బీ బ్యాంకు బ్రాంచ్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. ఎగుమతులు, ఎగుమతుల సేవలకు ప్రత్యేక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 500 పెద్ద కంపెనీల్లో కోటి మంది యువతకు ఉద్యోగాల కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
Also Read:
బడ్జెట్‌లో మెరుపులు ఇవే..
ఫైళ్ల దగ్ధంపై సీన్ రీకన్‌స్ట్రక్షన్..
కేసీఆర్ వస్తే ప్లాన్ ఏ... రాకపోతే ప్లాన్ బీ..
For More National News and Telugu News..