Tamil Nadu: మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై కేసు..
ABN , Publish Date - Jan 11 , 2024 | 01:52 PM
మతపరమైన విద్వేషాలను ప్రచారం చేశారంటూ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదైంది.
మతపరమైన విద్వేషాలను ప్రచారం చేశారంటూ తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై కేసు నమోదైంది. రెండు వర్గాల మధ్య మత విద్వేషాలను ప్రోత్సహించారనే ఆరోపణలపై ధర్మపురి జిల్లా బొమ్మిడి పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 153 (ఎ), 504, 505 (2) కింద కేసు నమోదు చేశారు. జనవరి 8న మద్దతుదారులతో కలిసి అన్నామలై ర్యాలీ నిర్వహించారు. బొమ్మిడిలోని సెయింట్ లూర్ద్ చర్చికి వచ్చి మేరీమాత విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వెంటనే అలర్ట్ అయిన యువకులు..యన చర్చిలోకి వెళ్లడాన్ని వ్యతిరేకించారు.
వారిని అన్నామలై ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ.. వివాదం జరిగింది. ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగి గొడవ ముదిరింది. ఈ క్రమంలో అన్నామలై, నిరసన చేస్తున్న యువకుల మధ్య జరిగిన ఆడియో.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై పి.పల్లిపట్టికి చెందిన కార్తీక్ అనే వ్యక్తి బీజేపీ అధ్యక్షుడిపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో పోలీసులు అన్నామలైపై కేసు నమోదు చేశారు.
మరిన్ని వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.