BJP vs Congress: దేశద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోలేరు.. రాహుల్‌పై కేంద్రమంత్రి ఫైర్
ABN , Publish Date - Sep 09 , 2024 | 01:29 PM
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ ద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్ అర్థం చేసుకోలేరని కౌంటర్ ఇచ్చారు. అనేక ఆలోచనల సమూహం భారతదేశమని కాంగ్రెస్ విశ్వసిస్తోందని..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్, మోదీని ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. దేశం ఒక ఆలోచన అని ఆర్‌ఎస్‌ఎస్ నమ్ముతుందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ స్పందించారు. దేశ ద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్ అర్థం చేసుకోలేరని కౌంటర్ ఇచ్చారు. అనేక ఆలోచనల సమూహం భారతదేశమని కాంగ్రెస్ విశ్వసిస్తోందని రాహుల్ టెక్సాస్ యూనివర్సిటీలో జరిగిన సమావేశంలో పేర్కొన్నారు. దేశంలో ప్రజలు భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నారని తెలిపారు. వారికి వారి సొంత విభిన్న కలలు ఉన్నాయని, వారి ఆలోచనా విధానం భిన్నంగా ఉంటుందన్నారు. కులం, భాష, మతం, సంప్రదాయాల ఆధారంగా విభిన్న అభిప్రాయాలు, ఆలోచనలను వేరు చేయలేమన్నారు. కలలు కనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని రాహుల్ గాంధీ తెలిపారు. తమ పోరాటం వీటిపైనే కొనసాగుతుందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో లక్షలాది మంది భారతీయులు ప్రధానమంత్రి భారత రాజ్యాంగంపై దాడిచేస్తున్నారని గ్రహించి.. ఎన్నికల్లో తీర్పు ఇచ్చారని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రజల పోరాటం ఎన్నికల్లో ఫలితాల్లో స్పష్టంగా కనిపించిందని రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ అదేస్థాయిలో స్పందించారు. దేశంలో ఆర్‌ఎస్‌ఎస్ పాత్ర గురించి రాహుల్ తమ అమ్మమ్మను అడిగే సాంకేతికత ఏదైనా ఉంటే అడగాలన్నారు. లేదా చరిత్ర పుటలను పరిశీలించాలని సూచించారు. రాహుల్ గాంధీ వంటి దేశ ద్రోహులు ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్ధం చేసుకోలేరని, దేశాన్ని విమర్శించడానికి విదేశాలకు వెళ్లే వారు దాని సారాంశాన్ని గ్రహించలేరని గిరిరాజ్ సింగ్ విమర్శించారు.
Kolkata: ఎంపీ పదవికి రాజీనామా.. సీఎం మమతకు ఘాటు లేఖ
దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకే..!
రాహుల్ గాంధీ భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయడానికే విదేశాల్లో పర్యటిస్తున్నట్లు కనిపిస్తోందని గిరిరాజ్ సింగ్ తెలిపారు. భారత దేశపు విలువలు, సంస్కృతిలో భాగమైన ఆర్‌ఎస్‌ఎస్‌ను రాహుల్ ఈ జన్మలో అర్థం చేసుకోలేరని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. దేశాన్ని విమర్శించడం, విదేశాల్లో భారత్‌ను చులకన చేయడమే రాహుల్ గాంధీకి తెలుసన్నారు.
Elections: అందరి టార్గెట్ జమ్మూకశ్మీర్.. బీజేపీ ఆరో జాబితా విడుదల
శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై..
ఇండియన్ ఓవర్‌సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా రాహుల్ గాంధీని ప్రశంసించడంపై బీజేపీ నేత అమిత్ మాల్వియా స్పందించారు. రాహుల్‌ను కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.. మీకు అర్థం అవుతారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు. సెప్టెంబర్ 10తో రాహుల్ అమెరికా పర్యటన ముగుస్తుంది. లోక్‌సభలో ప్రతిపక్షనేతగా ఎన్నికైన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ అమెరికాలో పర్యటిస్తున్నారు.
National Politics: మీడియాకు దూరంగా ఉండండి.. బ్రిజ్ భూషణ్ సింగ్‌కు నడ్డా సలహా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News