Share News

Chandrababu Naidu: గుడ్‌! బాగా పని చేశారు...

ABN , Publish Date - Jun 07 , 2024 | 12:03 PM

ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేశారని టీడీపీ చెన్నై విభాగానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు. టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆ పార్టీ చెన్నై విభాగ అధ్యక్షుడు డి.చంద్రశేఖర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Chandrababu Naidu: గుడ్‌! బాగా పని చేశారు...

- టీడీపీ చెన్నై విభాగానికి చంద్రబాబు ప్రశంస

చెన్నై: ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో బాగా పని చేశారని టీడీపీ చెన్నై విభాగానికి ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు(Chandrababu Naidu) ప్రశంసించారు. టీడీపీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో గురువారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆ పార్టీ చెన్నై విభాగ అధ్యక్షుడు డి.చంద్రశేఖర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ను చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు.

ఇదికూడా చదవండి: JNTU: జేఎన్‌టీయూలో మరో ఫార్మసీ కళాశాల...


nani1.jpg

నారా లోకేష్‌(Nara Lokesh) పాదయాత్రలో, భువనేశ్వరి ప్రజాగళం కార్యక్రమంలోనూ కో-ఆర్డినేటర్‌గా చక్కని పాత్ర నిర్వర్తించారంటూ భుజం తట్టి ప్రశంసించారు. అనంతరం భువనేశ్వరిని కూడా కలిసిన చంద్రశేఖర్‌(Chandrasekhar) ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రత్యేకంగా ప్రశంసించడం సంతోషంగా వుందని తెలిపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 07 , 2024 | 12:03 PM