Marina Beach: మెరీనా బీచ్ ఎయిర్‌షోలో తొక్కిసలాట.. ముగ్గురి మృతి
ABN , Publish Date - Oct 06 , 2024 | 09:25 PM
తిరుగు ప్రయాణంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ, ఉక్కపోతతో సుమారు 230 మంది స్పృహ తప్పి పోయినట్టు తెలుస్తోంది. వీరిలో 93 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రులకు తరలించారు.
చెన్నై: తమిళనాడు (Tamilnadu)లోని చెన్నై మెరీనా బీచ్ (Marina Beach)లో విషాదం చోటుచేసుకుంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఆదివారం మొదలైన మెగా 'ఎయిర్ షో'కు జనం పోటెక్కడంతో తొక్కిసలాట చోటుచేసుకుని ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. తిరుగు ప్రయాణంలో ఇసుకేస్తే రాలనంత రద్దీ, ఉక్కపోతతో సుమారు 230 మంది స్పృహ తప్పిపోయినట్టు తెలుస్తోంది. వీరిలో 93 మంది పరిస్థితి విషమంగా ఉండటంతో సమీప ఆసుపత్రులకు తరలించారు.
Bihar: స్నానానికి వెళ్లి నదిలో మునిగిపోయిన ఐదుగురు చిన్నారులు మృతి
కాగా, ఎయిర్‌షోకి లక్షలాదిగా తరలిరావడంతో మెరీనా బీచ్ సమీపంలోని లైట్ హౌస్ మెట్రో స్టేషన్, వేళచ్చేరి ఎంఆర్‌టీఎస్ రైల్వేస్టేషన్‌లు కిక్కిరిపోయాయి. అన్నా స్క్వేర్ బస్‌స్టాప్‌కు సందర్శకులు పోటెత్తారు. నిజానికి మధ్యాహ్నం ఒంటి గంటకే ఎయిర్ షో ముగిసినప్పటికీ ట్రాఫిక్ పునరుద్ధరించడానికి మూడు గంటలు పట్టినట్టు చెబుతున్నారు. సందర్శకులు తిరిగి వెళ్లే క్రమంలో తొక్కిసలాట చోటుచేసుకోవడంతో క్షతగాత్రులను తరలించే అంబులెన్స్‌లకు కూడా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.