Chennai: ‘ఫెంగల్’ తుపాను చరిత్రలో కొత్తది..
ABN , Publish Date - Dec 04 , 2024 | 11:16 AM
రాష్ట్ర తుఫాను చరిత్ర 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.500 కి.మీ దూరాన్ని మెల్లగా కదిలిన తుపానుగా ‘ఫెంగల్’ నిలిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం(Chennai, Chengalpattu, Cuddalore, Villupuram) మార్గాల్లో కదిలింది.
- 500 కి.మీ నిధానంగా దాటిన ‘ఫెంగల్’
చెన్నై: రాష్ట్ర తుఫాను చరిత్ర 50 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా రూ.500 కి.మీ దూరాన్ని మెల్లగా కదిలిన తుపానుగా ‘ఫెంగల్’ నిలిచింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుపాను చెన్నై, చెంగల్పట్టు, కడలూరు, విల్లుపురం(Chennai, Chengalpattu, Cuddalore, Villupuram) మార్గాల్లో కదిలింది. అనంతరం దిశ మార్చుకొని పశ్చిమ దిశగా పయనించి తిరువణ్ణామలై, కృష్ణగిరి, సేలం(Tiruvannamalai, Krishnagiri, Salem) తదితర జిల్లాల మీదుగా సాగింది. ఫెంగల్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రస్తుతం వర్షాలు తగ్గినా, జనజీవనం ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు.
ఈ వార్తను కూడా చదవండి: Fenugreek effect: ప్రజలకు కోపం వస్తే ఇలాగే ఉంటది మరి.. మంత్రిపై బురద చల్లిన ‘వరద’ బాధితులు..
ఈ నేపథ్యంలో, ఫెంగల్ తుపానుకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. 50 ఏళ్లగా రాష్ట్ర తుఫాన్‌ల చరిత్రలో ఇంత నిదానంగా కదులుతూ తుఫాన్ తీరం దాటలేదని వాతావరణ పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ విషయమై వాతావారణ కేంద్రం మాజీ అధికారి ఒకరు మాట్లాడుతూ... సాధారణంగా తుపానులు ఎప్పుడూ 220 కి.మీ నుంచి 300 కి.మీ వరకు 10 నుంచి 12 కి.మీ వేగంతో పయనిస్తుంటాయి. కానీ, ఫెంగల్ తుఫాన్ 3 కి.మీ వేగంతో మాత్రమే పయనించింది. అలా 500 కి.మీ వెళ్లేందుకు ఐదు రోజులు తీసుకుంది.
తుపానుగా మారిన మూడు రోజుల్లో బలపడుతుంది. కానీ నవంబరు 25వ తేది బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నాలుగు రోజుల అనంతరం అంటే 29వ తేది తుపానుగా మారింది. గత 50 ఏళ్ల రాష్ట్ర తుఫాను చరిత్రలో ఓ తుఫాను ఇలా మెల్లగా కదిలిన సందర్భాలు లేవు. సహజంగా తుఫాను తీరం దాటిన తర్వాత బలహీనపడుతుంది. కానీ, 9 గంటలు ఒకే ప్రాంతంలో ఉంటూ, సముద్రంలో తేమను బాగా గ్రహించి ఆ తర్వాత మెల్లగా తీరం దాటడం ప్రారంభించింది.
పలు జిల్లాల్లో అతి భారీవర్షాలు కురవడానికి ఇది కారంణం. వాతావరణ సమాచారాన్ని సరైన రీతిలో అంచనా వేసే వ్యవస్థ మన వద్ద లేదని అర్ధమవుతుందని ఆయన పేర్కొన్నారు. తొలుత, అరేబియా సముద్రం వైపు ఫెంగల్ తుఫాన్ కదులుతున్న నేపథ్యంలో, తిరుపత్తూర్ నుంచి తేని వరకు 15 జిల్లాలకు భారత వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం కొనమెరుపు.
ఈవార్తను కూడా చదవండి: రెండు రోజులుగా జలదిగ్భంధంలోనే సిరికొండ...
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. ధరణిలో భూమి నమోదు కాలేదని యువరైతు ఆత్మహత్య..
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
ఈవార్తను కూడా చదవండి: ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు గ్రీన్ సిగ్నల్
Read Latest Telangana News and National News