Share News

Chennai: నేడు చెన్నై సమీపానికి ‘ఫెంగల్’

ABN , Publish Date - Nov 28 , 2024 | 11:01 AM

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ‘ఫెంగల్‌’ అనే ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి.

Chennai: నేడు చెన్నై సమీపానికి ‘ఫెంగల్’

- శనివారం తీరం దాటే అవకాశం

- పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు

- వాతావరణ శాఖ హెచ్చరిక

- అల్లకల్లోలంగా సముద్రం

- ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు

చెన్నై: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ‘ఫెంగల్‌’ అనే ఈ తుఫాను ప్రభావం కారణంగా తమిళనాడు(Tamil Nadu)లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా తుఫాను గురువారం రాత్రి చెన్నై సమీపంలోకి రావొచ్చని, శనివారం చెన్నై - పుదుచ్చేరి(Chennai - Puducherry) మధ్య తీరం దాటవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: ఐదుగురిని బలిగొన్న మద్యం మత్తు..


ప్రస్తుతం ఇది బుధవారం సాయంత్రానికి నాగపట్టణానికి 370 కిలోమీటర్లు, చెన్నైకి 550 కిమీ, పుదుచ్చేరికి 470 కిలోమీటర్ల ఆగ్నేయ దిశగా కేంద్రీకృతమైవుంది. దీని ప్రభావంతో ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను ఉత్తర వాయువ్య దిశగా గంటకు 13 కిలోమీటర్ల వేగంతో కదులుతోందని వాతావారణ శాఖ తెలిపింది. ఇది గురువారం రాత్రి లేదా శుక్రవారం ఉదయానికి చెన్నై సమీపానికి రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, కొన్ని సమయాల్లో గంటకు 60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.


nani2.2.jpg

ఈ కారణంగా చెన్నై, కడలూరు, పుదుచ్చేరి, మైలాడుదురై, నాగపట్టణం, తిరువారూర్‌, తిరువళ్ళూరు, కాంచీపురం, చెంగల్పట్టు సహా 25 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించారు. ఇదిలా వుండగా రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా డెల్టా జిల్లాల్లో 55 వేల ఎకరాల్లో పంట నీటమునిగింది. చెన్నై నగర వాసులను భయపెడుతున్న ఈ తుఫాను తీరానికి చేరేలోగా బలహీనపడే సూచనలున్నాయని అధికారులు పేర్కొన్నారు.


18 వేల మంది పోలీసులు సిద్ధం

రాజధాని నగరాన్ని తుఫాను తాకితే తక్షణ సహాయక చర్యలు చేపట్టేందుకు 18 వేల మంది పోలీసులను సిద్ధం చేశారు. అలాగే, నగర వ్యాప్తంగా 35 కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు.

12 జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. చెన్నై నగరంలోని 12 డిప్యూటీ కమిషనర్‌ కార్యాలయాల్లో ఒక ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందం తరపున 12 సహాయక బృందాలను సిద్ధంగా ఉంచారు. నగర వ్యాప్తంగా 35 కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి 24 గంటల పాటు పనిచేసేలా సిబ్బందిని నియమించారు. అలాగే, 800 అగ్నిమాపకదళ ఇబ్బందిని కూడా అప్రమత్తం చేశారు.


పరీక్షల వాయిదా...

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పలు విశ్వవిద్యాలయాల పరిధిలో బుధవారం జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. మద్రాసు విశ్వవిద్యాలయం, కారైక్కుడి అళగప్పా వర్సిటీల పరిధిలో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు. ఈ పరీక్షలను మళ్ళీ ఎపుడు నిర్వహించేది తర్వాత వెల్లడిస్తామని ఆయా వర్శిటీల పరీక్షల నిర్వహణాధికారులు పేర్కొన్నారు.

తీరానికి వచ్చిన ఫ్లోటింగ్‌ బోట్‌

బంగాళాఖాతంలో భారత నావికా దళం ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్‌ బోట్‌ ఒకటి తీరానికి కొట్టుకుని వచ్చింది. సముద్రంలో వచ్చే స్వదేశీ, విదేశీ నౌకల రాకపోకలు సూచికలుగా ఈ ఫ్లోటింగ్‌ బోట్‌లు పనిచేస్తాయి. ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో ఫ్లోటింగ్‌ బోట్‌ తీరానికి కొట్టుకొచ్చింది.


చెన్నై - పుదువై మధ్య...

ఈ తుఫాను మొదట చెన్నై - నాగపట్టణం ప్రాంతాల మధ్య తీరం దాటొచ్చని అంచనా వేయగా, ప్రస్తుతం ఈ తుఫాను దిశ మారడంతో చెన్నై - పుదుచ్చేరి మధ్య తీరం దాటవచ్చని భావిస్తున్నారు. ఈ తుఫాను ప్రభావం కారణం గా 25 జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 29, 30వ తేదీల్లో అతి భారీ వర్షాలు కురవచ్చని తెలిపింది.

nani2.jpg


అల్లకల్లోలంగా సముద్రం

తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా వుంది. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు తీర ప్రాంత వాసులను భయపెడుతున్నాయి. సాధారణంగా పౌర్ణమి, అమావాస్య సమయాల్లో అలల తీవ్రత అధికంగా ఉంటుంది. అయితే, తుఫాను ప్రభావంతో అలలు ఐదడుగుల ఎత్తుకుపైగా ఎగిసిపడుతున్నాయి. దీంతో తీర ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని, జాలర్లు సముద్రంలోకి చేపల వేటకు వెళ్ళొద్దని వాతావారణ శాఖ అధికారులు సూచించారు. అలాగే, కోస్తాతీర జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


ఈవార్తను కూడా చదవండి: Khammam: దంపతుల దారుణ హత్య

ఈవార్తను కూడా చదవండి: Bhatti: క్రిస్మస్‌ వేడుకలకు ఏర్పాట్లు చేయండి

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: సరగసీ కోసం తెచ్చి లైంగిక వేధింపులు

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఇథనాల్‌ ఫ్యాక్టరీకి అనుమతులు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2024 | 11:01 AM