Chennai: నీలగిరి జిల్లాలో కుండపోత..
ABN , Publish Date - Oct 01 , 2024 | 02:41 PM
నీలగిరి(Neelagiri) జిల్లా కున్నూరు మౌంట్‌రోడ్ కృష్ణాపురం ప్రాంతంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా సోమవారం వేకువజాము ఓ ఇంటి ముందు మట్టిపెళ్లలు పడటంతో ఓ ఉపాధ్యాయురాలు దుర్మరణం చెందారు. కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కూడా కున్నూరు అంతటా భారీగా వర్షాలు కురిశాయి.
- మట్టిపెళ్లలు విరిగిపడి టీచర్ మృతి
చెన్నై: నీలగిరి(Neelagiri) జిల్లా కున్నూరు మౌంట్‌రోడ్ కృష్ణాపురం ప్రాంతంలో కుండపోతగా కురిసిన భారీ వర్షాల కారణంగా సోమవారం వేకువజాము ఓ ఇంటి ముందు మట్టిపెళ్లలు పడటంతో ఓ ఉపాధ్యాయురాలు దుర్మరణం చెందారు. కున్నూరు పరిసర ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కూడా కున్నూరు అంతటా భారీగా వర్షాలు కురిశాయి. రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం వేకువజాము వరకు కురిసింది.. కున్నూరు మౌంట్‌రోడ్డు కృష్ణాపురం ప్రాంతం వద్ద ఓ ఇంటిలో ఆదివారం రాత్రి రవి, ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఆయన భార్య జయలక్ష్మి ఆమె పిల్లలు నిద్రపోయారు. అర్ధరాత్రి ఆ ఇంటి తలుపు కిందనుంచి వర్షపు నీరు చొరబడింది.
ఇదికూడా చదవండి: Chennai: బ్రహ్మోత్సవాలకు తిరుపతికి ప్రత్యేక బస్సులు..
దీంతో జయలక్ష్మి లేచి తలుపు తీయగానే ఇంటి ముందున్న మట్టి దిబ్బలపై నుండి మట్టిపెళ్లలు విరిగి ఆమెపై పడ్డాయి. వాటిలో చిక్కుకుని జయలక్ష్మి ఊపిరాడక మృతి చెందారు. మట్టిపెళ్లలు పడిన శబ్దానికి చుట్టుపక్కల ఇళ్లలోనివారు, జయలక్ష్మి భర్త రవి లేచారు. ఇంటిముందు మట్టిపెళ్ళలు పడి ఉండటం ఆ మట్టి దిగువ భార్య చిక్కుకుని ఉండడం చూసి దిగ్ర్భాంతి చెందారు. చుట్టుపక్కల నివసిస్తున్నవారంతా మట్టి పెళ్ళలు తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ సమాచారం తెలుసుకుని పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన అక్కడికిచేరుకుని మట్టి పెళ్లలను తొలగించారు.
వాటి దిగువనున్న జయలక్ష్మి మృతదేహాన్ని తీసి పోస్టుమార్టం కు తరలించారు. ఇక కున్నూరు సమీపం కాట్టేరి, డాల్ఫినర్ నోస్ తదితర ప్రాంతాల్లో వర్షంతో పాటు ఈదురుగాలులకు చెట్లు కూలిపడ్డాయి. కున్నూరు ఆపిల్ బీ రోడ్డులో వర్షానికి ప్రహరీగోడ కూలింది. దీంతో ఆ మర్గాంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈ వర్షాలకు కున్నూరు చుట్టుపక్కల 50కి పైగా గ్రామాల్లో రాత్రంతా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రజలు అంధకారంలో కొట్టుమిట్టాడారు.
ఊటీ కొండ రైలు రద్దు..
కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం - కున్నూరు రైలు మార్గంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు మూడు చోట్ల మట్టిపెళ్ళలు, బండరాళ్లు కూలిపడటంతో ఊటీ కొండరైలు సర్వీసును రద్దు చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంగా ఉన్న కల్లార్- కున్నూరు రైలు మార్గంలో మట్టి పెళ్లలు పట్టాలపై పడ్డాయి. సోమవారం వేకువజాము రైల్వే సిబ్బంది తనిఖీకి వెళ్ళిన సమయంలో విషయం తెలుసుకుని వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే కున్నూరుకు బయలుదేరిన ఊటీ కొండ రైలు రైల్వే అధికారులు కల్లార్ రైల్వేస్టేషన్ వద్ద నిలిపివేశారు. ఆ తర్వాత ఆ రైలును మేట్టుపాళయంకు తిప్పిపంపారు. ప్రస్తుతం రైల్వే కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది పట్టాలపై పడిన మట్టిపెళ్ళలను తొలగించే పనుల్లో నిమగ్నమయ్యారు.
ఇదికూడా చదవండి: హైడ్రాతో నష్టపోయిన పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంది
ఇదికూడా చదవండి: ఎమ్మెస్సీ నర్సింగ్‌కు ప్రవేశ పరీక్ష నిర్వహించాలి
ఇదికూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో హైఅలర్ట్... కారణమిదే
ఇదికూడా చదవండి: ఉపఎన్నికపై కడియం శ్రీహరి సంచలన కామెంట్స్
Read Latest Telangana News and National News