Share News

Chennai: భారీ వర్షాలకు నలుగురి బలి..

ABN , Publish Date - Dec 13 , 2024 | 10:51 AM

రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో పాఠశాల విద్యార్థి, అయ్యప్య భక్తుడి సహా నలుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో పది రోజుల కిత్రం ‘ఫెంగల్‌’ తుఫాన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో పదిమంది మృతిచెందారు.

Chennai: భారీ వర్షాలకు నలుగురి బలి..

చెన్నై: రాష్ట్రంలో కురుస్తున్న భారీవర్షాల కారణంగా వేర్వేరు ఘటనల్లో పాఠశాల విద్యార్థి, అయ్యప్య భక్తుడి సహా నలుగురు మృతిచెందారు. వారిలో ముగ్గురు విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో పది రోజుల కిత్రం ‘ఫెంగల్‌’ తుఫాన్‌ కారణంగా పలు ప్రాంతాల్లో పదిమంది మృతిచెందారు. ఈ క్రమంలో, ప్రస్తుతం అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాల కారణంగా మృతిచెందిన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: IMD: త్వరలో మరో 2 అల్పపీడనాలు..


నాగపట్టణం(Nagapattinam) జిల్లాలో ఇంటి గోడ కూడి 13 ఏళ్ల బాలుడు మృతిచెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. జిల్లాలో కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి. సెంబియన్‌ మహాదేవి గ్రామానికి చెందిన మురుగదాస్‌ ఇంటి పైకప్పుపై పక్క ఇంటి గోడ కూలి పడింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న మురుగదాస్‌, ఆయన భార్య, కుమార్తె, కుమారుడు కవియళగన్‌ (13) గోడ శిధిలాల కింద చిక్కుకున్నారు. చుట్టుపక్కల వారు శిధిలా నుంచి వారిని రక్షించి నాగపట్టణం ప్రభుత్వ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో కవియళగన్‌ మృతిచెందాడు. మురుగదాస్‌ సహా ముగ్గురిని వైద్యులు చికిత్సలందిస్తున్నారు.


city3.jpg

రాణిపేట జిల్లా మోచూర్‌ ప్రాంతానికి చెందిన సురేష్‌ (23) ప్రస్తుతం అయ్యప్ప మాల ధరించాడు. బుఽధవారం రాత్రి ఓ ఆలయంలో పూజల్లో పాల్గొన్న సురేష్‌, రాత్రి అక్కడే ఉన్నాడు. గురువారం ఉదయం స్నానం చేసి, ఉతికిన బట్టలను ఆరబెడుతున్న సమయంలో కిందపడిన విద్యుత్‌ తీగపై కాలు వేయడంతో విద్యుదాఘాతానికి గురై సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు.


తిరుపోరూర్‌ సమీపంలో...

చెంగల్పట్టు జిల్లా తిరుపోరూర్‌ సమీపంలోని పొలాల్లో ఇద్దరు యువకులు మృతిచెంది ఉండడాన్ని గురువారం ఉదయం గ్రామస్తులు గుర్తించారు. సమాచారం అందుకున్న కాయారు పోలీసులు అక్కడకు చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ ప్రాంతంలో కొద్దిరోజులుగా తరచూ విద్యుత్‌ పరికరాలు చోరీకి గురవుతున్నాయి. మృతుల పక్కన విద్యుత్‌ పరికరాలను కట్‌ చేసే పరికరాలు ఉండడంతో, వారు చోరీకి వచ్చి విద్యుదాఘాతానికి గురై మృతిచెంది ఉంటారని భావించిన పోలీసులు మృతుల వివరాలకు కోసం విచారిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2024 | 10:51 AM