Share News

Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి

ABN , Publish Date - Jul 05 , 2024 | 11:38 AM

తమిళనాడులో తెలుగుభాషను బతికించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు(AP Chief Minister Chandrababu Naidu)డిని కలిసి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి న కేతిరెడ్డి.. ఈ మేరకు వినతిపత్రా న్ని అందజేశారు.

Chennai: తమిళనాడులో తెలుగును బతికించండి.. చంద్రబాబుకు కేతిరెడ్డి వినతి

- త్వరలోనే స్టాలిన్‌తో మాట్లాడతా

- చంద్రబాబు హామీ

చెన్నై: తమిళనాడులో తెలుగుభాషను బతికించాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు(AP Chief Minister Chandrababu Naidu)డిని కలిసి తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. అమరావతిలో చంద్రబాబును కలిసి న కేతిరెడ్డి.. ఈ మేరకు వినతిపత్రా న్ని అందజేశారు. ‘‘ ఐదేళ్ల క్రితం తమిళనాడులో భాషాపరమైన సమస్య తలెత్తినప్పుడు మీరు జోక్యం చేసుకుని, తమిళనాడు ముఖ్యమంత్రులతో మాట్లాడి సమస్యను కొంత మేరకు పరిష్కరించినందుకు మీకు కృతజ్ఞతలు. అయితే గత ఐదేళ్లుగా పరిస్థితి ఇందుకు భిన్నంగా వుంది. తమిళనాడులో సమస్య పరిష్కారం కోసం గళమెత్తగా.. ‘తెలుగు మాధ్యమంలో చదువుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్‌లోనే లేకపోతే, ఇక్కడ అలాంటి అవకాశం కావాలని మమ్మల్ని ఎలా అడుగుతారు?’ అంటూ తమిళ నేతలు, అధికారులు తిరస్కరిస్తున్నారు. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం మిమ్మల్ని ఆశ్రయించాను. 1982 మే 28న తెలుగుదేశం పార్టీ తొలినాళ్లలో పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు విడుదల చేసిన తెలుగు భాషా విధానాన్ని పరిశీలించి,

ఇదికూడా చదవండి: ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే ఇదేనా సారూ..


ప్రజానుకూల చర్యల అమలుకు పూనుకోండి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కనీసం పదవ తరగతి వరకు మాతృభాషలో మాత్రమే విద్యాబోధన ఉండేలా చర్యలు తీసుకోండి. తమిళనాడుతో పాటు ఆంధ్రేతర రాష్ట్రాల్లో జీవిస్తున్న తెలుగువారి పిల్లల కోసం జనాభా దామాషా ప్రకారం పాఠశాలలు ఏర్పాటు చేసేలా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురండి. తమిళనాడులో తెలుగుభాషాభివృద్ధి కోసం, తెలుగు మాధ్యమంలో పిల్లలు చదువుకునేలా ఇక్కడి ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించండి. అని కేతిరెడ్డి ఏపీ ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో అభ్యర్థించారు. ఆయన వినతులను ఆలకించిన చంద్రబాబు.. త్వరలోనే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌తో మాట్లాడతానని హామీ ఇచ్చినట్లు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. తెలుగుభాషా సమస్య పట్ల ఎంతో సానుకూలంగా స్పందించిన చంద్రబాబుకు ఈ సందర్భంగా కేతిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 05 , 2024 | 11:38 AM