Share News

CM Stalin: పోలీసుశాఖకు సీఎం వరాల జల్లు..

ABN , Publish Date - Jun 30 , 2024 | 11:39 AM

శాసనసభ చివరిరోజు సమావేశాల సందర్భంగా హోంశాఖను నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పోలీసుశాఖపై వరాల జల్లు కురిపించారు. పాత భవనాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని, శాఖను పటిష్ఠ పరిచేందుకు కొత్త పోస్టులను రూపొందిస్తామని, వాహనాలు, పరికరాల కొనుగోలుకు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు.

CM Stalin: పోలీసుశాఖకు సీఎం వరాల జల్లు..

చెన్నై: శాసనసభ చివరిరోజు సమావేశాల సందర్భంగా హోంశాఖను నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) పోలీసుశాఖపై వరాల జల్లు కురిపించారు. పాత భవనాల్లోని పోలీసుస్టేషన్లకు కొత్త భవనాలు నిర్మించి ఇస్తామని, శాఖను పటిష్ఠ పరిచేందుకు కొత్త పోస్టులను రూపొందిస్తామని, వాహనాలు, పరికరాల కొనుగోలుకు భారీగా నిధులు కేటాయిస్తామని తెలిపారు. పోలీసులు శాఖకు సంబంధించి ఆర్థిక పద్దులను ఆయన ప్రవేశపెడుతూ ... పోలీసుస్టేషన్లు, పోలీసుల క్వార్టర్స్‌(Police quarters) తదితర భవనాల మరమ్మతులు, నిర్వహణ పనులకు ప్రభుత్వం కేటాయించే నిధిని రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్లకు పెంచనున్నట్లు తెలిపారు.

ఇదికూడా చదవండి: Danapur Express: ‘దానాపూర్‌’ రైలు ప్రయాణికులకు శుభవార్త.. అదేంటంటే..


కొత్తగా 300 వాహనాలు కొనేందుకు రూ.31.50 కోట్లు, 25 వ్యాన్లకు రూ.5.25 కోట్లు, 15 పోలీసు బస్సుల కొనుగోలుకు రూ.4.5 కోట్లు, 500 బైకుల కొనుగోలుకు రూ.5.50 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో మృతి చెందితే ప్రభుత్వమిచ్చే పరిహారాన్ని రూ.25లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచినట్లు, అవిటితనానికి గురైతే ఇచ్చే సహాయాన్ని రూ.12 లక్షల నుంచి రూ.15లక్షలకు పెంచినట్లు తెలిపారు. ఇక తాంబరం పరిధిలోని మణిమంగళం పోలీసుస్టేషన్‌ను విభజించి పడప్పైలో కొత్త పోలీసుస్టేషన్‌ను, మదురై జిల్లా తిరుప్పరంకుండ్రం పోలీసుస్టేషన్‌ను విభజించి తిరుప్పరంకుండ్రం ఆలయానికంటూ ప్రత్యేక పోలీసుస్టేషన్‌ను, తిరువణ్ణామలై జిల్లా ఆదమంగళపుదూరులో కొత్త పోలీసుస్టేషన్‌ను, చెన్నై కొళత్తూరు సర్కిల్‌లో కొత్తగా మహిళా పోలీసుస్టేషన్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.

ఇదికూడా చదవండి: అయోధ్యలో కుంగిన రామ్‌పథ్‌!


కీలంబాక్కం, ఏర్కాడుల్లో కొత్తగా ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లను ప్రారంభించి, ఆవడి పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కొత్తగా పొన్నేరి సర్కిల్‌ను విలీనం చేస్తామన్నారు. ఇక కొత్వాల్‌చావిడి పోలీసుస్టేషన్‌కు, కాంచీపురం జిల్లా విష్ణుకాంచి పోలీసుస్టేషన్‌కు, దిండుగల్‌ జిల్లా కన్నివాడి పోలీసుస్టేషన్‌కు, తిరువారూరు జిల్లా కూత్తనల్లూరు పోలీసుస్టేషన్‌కు కొత్త భవనాలు నిర్మించనున్నట్లు వివరించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 30 , 2024 | 11:39 AM