Share News

P Chidambaram: హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలను తేల్చిచెప్పిన చిదంబరం

ABN , Publish Date - Oct 07 , 2024 | 08:27 PM

హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో గెలుపెవరిదో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం తేల్చిచెప్పారు. కాంగ్రెస్ చిరకాల విధానాలను ప్రజామోదం కనిపిస్తోందన్నారు.

P Chidambaram: హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలను తేల్చిచెప్పిన చిదంబరం

తిరుచిరాపల్లి: హర్యానా (Haryana), జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో గెలుపెవరిదో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం (P Chidambaram) తేల్చిచెప్పారు. కాంగ్రెస్ చిరకాల విధానాలను ప్రజామోదం కనిపిస్తోందన్నారు. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ధీమా వ్యక్తం చేశారు.

Tejaswi Yadav: సోఫాలు, ఎసీలు, పరుపులు ఎత్తుకెళ్లారు.. తేజస్విపై బీజేపీ సంచలన ఆరోపణ


''చిరకాలంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధానాలకు కట్టుబడి ఉందో వాటిని ప్రజలు ఆమోదించనున్నారు. కొద్దికాలం వేరే వాళ్ల సిద్ధాంతాలు, విధానాలు గెలిచినట్టు కనిపించ వచ్చు. అయితే దీర్ఘకాలంలో కాంగ్రెస్ పార్టీ విధానాలు, సిద్ధాంతాలకు ప్రజామోదం ఉంటుంది. నా వాదనకు హర్యానా, జమ్మూకశ్మీర్ ఎన్నికల ఫలితాలే బలం చేకూరుస్తాయని ఆశిస్తున్నాను'' అని చిదంబరం అన్నారు.


చెన్నై ఎయిర్ షో సందర్భంగా తీవ్ర ఉష్ణోగ్రతలు, ఇతర మెడికల్ కండిషన్ల కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమని చిదంబరం అన్నారు. మృతుల కుటుంబాలకు తమిళనాడు ప్రభుత్వం పెద్దమనసుతో పరిహారం ఇస్తుందని ఆశిస్తున్నట్టు చెప్పారు. కాగా, హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాను. హర్యానాలో కాంగ్రెస్ విజయం ఖాయమని, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమి తమ ప్రత్యర్థుల కన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.


Read More National News and Latest Telugu News

ఇది కూడా చదవండి...

Amith Shah: ముగిసిన భేటీ.. మావోయిస్టులపై కీలక వ్యాఖ్యలు

Updated Date - Oct 07 , 2024 | 08:27 PM