Share News

Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం

ABN , Publish Date - Sep 06 , 2024 | 06:27 PM

ఈనెల 4న న్యూఢిల్లీలో రాహుల్‌ గాంధీని ఫోగట్ కలిసిన అనంతరం ఆమెకు ఇండియన్ రైల్వే షోకాజ్ నోటీసు పంపినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Congress: రైల్వే నుంచి ఫోగట్‌కు షోకాజ్.. కాంగ్రెస్ సంచలన అభియోగం

న్యూఢిల్లీ: ఒలంపిక్ రెజ్లర్లు వినేష్ ఫోగట్(Vinesh Phogat), బజ్‌రంగ్ పునియా (Bajrang Punia) కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరిన కొద్దిసేపటికే భారత రైల్వేపై ఆ పార్టీ సంచలన ఆరోపణ చేసింది. ఈనెల 4న న్యూఢిల్లీలో రాహుల్‌ గాంధీని ఫోగట్ కలిసిన అనంతరం ఆమెకు ఇండియన్ రైల్వే (Indian Railway) షోకాజ్ నోటీసు పంపినట్టు కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్ శుక్రవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. ఆమె(Phogat) చేసిన నేరమల్లా రాహుల్ గాంధీని కలుసుకోవడమేనని చెప్పారు. రైల్వేలు రాజకీయాలు చేయరాదని, వినేశ్ ఫోగట్‌ను రిలీవ్ చేసేందుకు ఫార్మాలిటీస్ పూర్తి చేయాలని కోరారు.


కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి ముందే వినేశ్ ఫోగట్, బజరంగ్ పునియా తమ రాజీనామా పత్రాలను సంబంధిత రైల్వే అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని ఫోగట్ శుక్రవారంనాడు ఒక ట్వీట్‌లో తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం ఇచ్చిన రైల్వే శాఖకు కృతజ్ఞతలు తెలిపారు.

Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా..


కాంగ్రెస్‌లో చేరడం గర్వంగా ఉంది: ఫోగట్

కాంగ్రెస్ పార్టీలో చేరడం గర్వంగా ఉందని వినేశ్ ఫోగట్ మీడియా సమావేశంలో తెలిపారు. రెజ్లింగ్ జర్నీలో తనను ప్రోత్సహించిన దేశప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ''కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పదలచాను. మమ్మల్ని (రెజ్లర్లు) రోడ్లపైకి లాగినప్పుడు బీజేపీ మినహా అన్ని పార్టీలు మాతో ఉన్నాయి. వారు మా బాధను, కన్నీళ్లను అర్థం చేసుకున్నారు. మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న కాంగ్రెస్ వంటి పార్టీలో చేరడం గర్వంగా భావిస్తున్నాను. రోడ్లపై నుంచి పార్లమెంటు వరకూ పోరాటానికి కాంగ్రెస్ పార్టీకి సిద్ధంగా ఉంది'' అని అన్నారు.


పార్టీ, దేశ పటిష్టకు పాటుపడతా: పునియా

కాంగ్రెస్ పార్టీ, దేశ పటిష్టతకు అహరహం కష్టపడతానని బజ్‌రంగ్ పునియా అన్నారు. బీజేపీని టార్గెట్‌ చేస్తూ, మహిళలపై జరుగుతున్న అకృత్యాలకు వాళ్లు సపోర్ట్ చేస్తున్నారని తప్పుపట్టారు. వినేష్ 'ఫైనల్స్'కు చేరినప్పుడు యావద్దేశం సంతోషించిందని, అయితే ఆ మరుసటి రోజు అంతా విషాదంలో మునిగిపోయారని చెప్పారు. కానీ, ఒక ఐటీ సెల్ మాత్రం పండగ చేసుకుందని పరోక్షంగా బీజేపీ ఐటీ సెల్‌ను విమర్శించారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Karnataka: కర్ణాటకలో వెలుగులోకి మరో స్కాం..

Updated Date - Sep 06 , 2024 | 06:27 PM