Share News

PM Modi: కాంగ్రెస్‌ వాటా.. ముస్లిం కోటా.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

ABN , Publish Date - Apr 24 , 2024 | 04:40 AM

జైపూర్‌/రాయ్‌పూర్‌, ఏప్రిల్‌ 23: దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని, మీ(హిందువుల) ఆస్తులను ఎక్స్‌-రే చేసి, ఎంపిక చేసిన వర్గానికి (ముస్లింలకు) పంచాలని చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.

PM Modi: కాంగ్రెస్‌ వాటా.. ముస్లిం కోటా.. ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

  • దళితులు, ఆదివాసీల రిజర్వేషన్ల కత్తిరింపు!

  • 2004లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పైలట్‌ ప్రాజెక్టు

  • 2011లో కూడా దేశవ్యాప్తంగా అమలుకు యత్నాలు

  • మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం

  • ఇప్పుడు కాంగ్రెస్‌ వస్తే.. మళ్లీ అదే ప్రయత్నం చేస్తుంది

  • మీ ఆస్తులను ఎక్స్‌–రే చేసి.. ముస్లింలకు పంచుతుంది

  • కర్ణాటకలో హనుమాన్‌ చాలీసా వినడం కూడా నేరమైంది

  • రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ఏలికలో రామనవమిపై రాళ్లదాడి

  • దక్షిణాదిని వేరు చేయాలని కర్ణాటక కాంగ్రెస్‌ నేత అంటారు

  • దేశాన్ని మళ్లీ విభజించాలని ఆ పార్టీ కోరుకుంటోందా?

  • రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ర్యాలీల్లో.. కాంగ్రెస్‌పై మోదీ ఆగ్రహం

  • ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు కొనసాగుతాయని వాగ్దానం

జైపూర్‌/రాయ్‌పూర్‌, ఏప్రిల్‌ 23: దేశంలో మతపరమైన రిజర్వేషన్లకు కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోందని, మీ(హిందువుల) ఆస్తులను ఎక్స్‌–రే చేసి, ఎంపిక చేసిన వర్గానికి (ముస్లింలకు) పంచాలని చూస్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. దేశాన్ని విభజించాలన్నట్లుగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో హనుమాన్‌ చాలీసాను వినడం కూడా నేరంగా మారిందని (కర్ణాటకలో), రామనవమి వేడుకలపై రాళ్లదాడులు జరిగేవని (కాంగ్రెస్‌ పాలనలో రాజస్థాన్‌లో) విమర్శించారు. రాజస్థాన్‌లోని టోంక్‌లో.. ఛత్తీస్‌గఢ్‌లోని శక్తి జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 2004 నుంచి ముస్లిం రిజర్వేషన్లే ఎజెండాగా కాంగ్రెస్‌ ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. ‘‘2004లో కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పైలట్‌ ప్రాజెక్టుగా తన ప్రయత్నాలను ప్రారంభించింది.

అక్కడ(ఏపీలో) దళితులు, గిరిజనుల కోటాను తగ్గించి, ముస్లింలకు రిజర్వేషన్లను కల్పించాలని నాలుగు సార్లు ప్రయత్నించింది. న్యాయపరమైన చిక్కులు ఎదురవ్వడంతో ఆ ప్రయత్నాలు సఫలమవ్వలేదు’’ అని మోదీ వివరించారు. 2011లో కాంగ్రెస్‌ సర్కారు ఏకంగా దేశవ్యాప్తంగా ముస్లిం రిజర్వేషన్లకు ప్రయత్నించిన విషయాన్ని గుర్తుచేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని, ఆ దిశలో చర్యలు తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను అవమానపరిచిందంటూ మండిపడ్డారు. బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇతరుల సంపదను దోచి, ముస్లింలకు పంచడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘నేను దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఇది మోదీ గ్యారెంటీ..! ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయి. అంబేడ్కర్‌ ఆశయాలను కాపాడుతాం’’ అని మోదీ వివరించారు.

తాను మూడ్రోజుల క్రితం రాజస్థాన్‌లో 90 సెకన్లపాటు ఇచ్చిన ఉపన్యాసంతో (కాంగ్రెస్‌ వస్తే.. మహిళల మెడల్లోని మంగళసూత్రాలను కూడా లాక్కొంటుంది అని మోదీ వ్యాఖ్యానించారు) కాంగ్రెస్‌ పార్టీలో.. ఇండియా కూటమిలో కల్లోలం మొదలైందన్నారు. ‘‘అవును.. నేను చెబుతున్నా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఆస్తులను ఎక్స్‌రే చేసి, వాటిని ఎంపిక చేసుకున్న కొందరికి పంచిపెడుతుంది. కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు కుతంత్రాలను నేను బహిర్గతం చేశాను. నేను నిజం చెబితే.. కాంగ్రెస్‌లో జంకు ఎందుకు? నేను వారి(కాంగ్రెస్‌) రహస్య ఎజెండాను బయటపెట్టాననేనా?’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘కేంద్రంలో 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై ప్రజలు రాళ్లు రువ్వేవారు. శత్రువులు సరిహద్దుల్లో కాల్పులు జరిపేవారు’’ అని వ్యాఖ్యానించారు.


దళితులను అవమానించిన కాంగ్రెస్‌..

తాము ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నామని, గడిచిన పదేళ్లలో దేశాన్ని ఎంతగానో అభివృద్ధి చేశామని, కాంగ్రె్‌సకు గానీ, ఇండియా కూటమికి గానీ ఒక లక్ష్యమంటూ లేదని ఎద్దేవా చేశారు. ‘‘కాంగ్రెస్‌ నినాదాలిస్తుంది. గరీబీ హఠావో అని పిలుపునిచ్చి.. 60 ఏళ్లుగా ఆ నినాదాన్ని పాతిపెట్టింది. మేము(బీజేపీ) నినాదాలపై ఆధారపడేది లేదు. ఏదైనా చేతల్లో చూపిస్తాం. అయోధ్యలో రామ మందిర కలను సాకారం చేశాం. కానీ, కాంగ్రెస్‌ మాత్రం రాముడిని అవమానించింది. ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన రామభక్తురాలు, గిరిజన మహిళ శబరిని అవమానించింది. బీజేపీ అధికారంలోకి రాగానే.. దళితుడైన రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిగా చేస్తే.. కాంగ్రెస్‌ ఆయనను అవమానించింది. ఆ తర్వాత గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనే అవమానించింది’’ అని ప్రధాని నిప్పులు చెరిగారు. పరిపాలనలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు ఉండడం కాంగ్రె్‌సకు నచ్చని విషయమని వివరించారు. ఛత్తీ్‌సగఢ్‌లో నక్సలిజాన్ని తగ్గిస్తూ వస్తున్నామని గుర్తుచేశారు.

దేశాన్ని విభజించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమా?

దేశాన్ని విభజించడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమా అని ఛత్తీ్‌సగఢ్‌ ర్యాలీలో మొదీ ప్రశ్నించారు. ‘‘దేశాన్ని ఒకసారి మతప్రాతిపదికన విడదీశారు. ఇటీవల కర్ణాటకకు చెందిన ఓ కాంగ్రెస్‌ నేత దక్షిణాదిని విడదీయాలన్నారు. తాజాగా గోవాలో ఎన్నికల బరిలో ఉన్న మరో కాంగ్రెస్‌ నేత(విరియాటొ ఫెర్నాండెజ్‌) తమపై రాజ్యాంగాన్ని బలవంతంగా రుద్దామన్నారు. గోవా విడిగా ఉండాలన్నారు. అంటే.. కాంగ్రెస్‌ తనకు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ప్రాంతాలను విడదీసి, పాలించాలని భావిస్తోందా?’’ అని నిలదీశారు. కాంగ్రెస్‌ నేతలు మాటలు అంబేడ్కర్‌ను అవమానించడమేనన్నారు.


బీజేపీ మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ కాంగ్రెస్‌ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. ఇతరుల సంపదను దోచి, ముస్లింలకు పంచడం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను తగ్గించి, మతపరమైన రిజర్వేషన్లను అమలు చేయడమే కాంగ్రెస్‌ సిద్ధాంతమని ఆరోపించారు. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రాగానే ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ‘‘నేను దేశ ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఇది మోదీ గ్యారెంటీ..! ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కొనసాగుతాయి. అంబేడ్కర్‌ ఆశయాలను కాపాడుతాం’’ అని మోదీ వివరించారు.

తాను మూడ్రోజుల క్రితం రాజస్థాన్‌లో 90 సెకన్లపాటు ఇచ్చిన ఉపన్యాసంతో (కాంగ్రెస్‌ వస్తే.. మహిళల మెడల్లోని మంగళసూత్రాలను కూడా లాక్కొంటుంది అని మోదీ వ్యాఖ్యానించారు) కాంగ్రెస్‌ పార్టీలో.. ఇండియా కూటమిలో కల్లోలం మొదలైందన్నారు. ‘‘అవును.. నేను చెబుతున్నా.. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. ఆస్తులను ఎక్స్‌రే చేసి, వాటిని ఎంపిక చేసుకున్న కొందరికి పంచిపెడుతుంది. కాంగ్రెస్‌ ఓటుబ్యాంకు కుతంత్రాలను నేను బహిర్గతం చేశాను. నేను నిజం చెబితే.. కాంగ్రె్‌సలో జంకు ఎందుకు? నేను వారి(కాంగ్రెస్‌) రహస్య ఎజెండాను బయటపెట్టాననేనా?’’ అని మోదీ ప్రశ్నించారు. ‘‘కేంద్రంలో 2014లో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఇప్పటికీ జమ్మూకశ్మీర్‌లో జవాన్లపై ప్రజలు రాళ్లు రువ్వేవారు. శత్రువులు సరిహద్దుల్లో కాల్పులు జరిపేవారు’’ అని వ్యాఖ్యానించారు.

Updated Date - Apr 24 , 2024 | 07:40 AM