Share News

Delhi Assembly Elections: 'ఆప్'తో పొత్తుకు నో.. ఒంటరి పోరుకు కాంగ్రెస్ నిర్ణయం

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:04 PM

కాగా, ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరితో ముగియనుంది. దీంతో ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. చివరిసారిగా 2020 అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించారు.

Delhi Assembly Elections: 'ఆప్'తో పొత్తుకు నో.. ఒంటరి పోరుకు కాంగ్రెస్ నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో జరుగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) ఒంటరిగానే పోటీ చేస్తామని, ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)తో ఎలాంటి పొత్తు ఉండదని కాంగ్రెస్ (Congress) పార్టీ శుక్రవారంనాడు ప్రకటించింది. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామని ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేంద్ర యాదవ్ తెలిపారు. ఏ పార్టీతోనూ పొత్తులుండవని స్పష్టం చేశారు. ఎన్నికల అనంతరమే ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని వెల్లడించారు.

CWC Meet: ఎన్నికల ఫలితాలు ఓ సవాల్.. ఐక్యంగా పార్టీని బలోపేతం చేయాలి: ఖర్గే దిశానిర్దేశం


ఇది ధర్మయుద్ధం: కేజ్రీవాల్

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను 'ధర్మయుద్ధం'గా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఇటీవల అభివర్ణించారు. చాందినీ చౌక్‌లో పార్టీ జిల్లా స్థాయి ఆఫీసుబేరర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ''కౌరవుల్లాగానే వారికి (ప్రత్యర్థులు) డబ్బులు, అధికారం ఉన్నాయి. కానీ పాండవుల తరహాలోనే భగవంతుడు, ప్రజలు కూడా మనవైపే ఉన్నారు'' అని అన్నారు.


43 కమిటీలను ఏర్పాటు చేసిన బీజేపీ

మరోవైపు, అసెంబ్లీ ఎన్నికల్లో చేయాల్సిన పనులు, అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి 43 కమిటీలను ఢిల్లీ బీజేపీ గురువారంనాడు ప్రకటించింది. మహిళలు, యువకులు, ఎస్సీలు, ఓబీసీల లక్ష్యంగా ప్రచారం సాగించడం, కేంద్ర లబ్దిదారులను నేరుగా కలుసుకోవడం వంటి పనులను ఈ కమిటీలు చేపడతాయి. కాగా, ఢిల్లీ 7వ అసెంబ్లీ గడువు 2025 ఫిబ్రవరితో ముగియనుంది. దీంతో ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. చివరిసారిగా 2020 అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరిలో నిర్వహించారు. 'ఆప్' ఘనవిజయం సాధించడంతో కేజ్రీవాల్ వరుసగా మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. మద్యం పాలసీ స్కాములో మనీలాండరింగ్ ఆరోపణలతో కేజ్రీవాల్ ఇటీవల రాజీనామా చేయడంతో ఆప్ సీనియర్ నేత అతిషి సీఎం పగ్గాలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

Maharashtra: కొనసాగుతున్న సస్పెన్స్.. కీలక సమావేశం రద్దు, సొంత గ్రామానికి షిండే

Karnataka: ముస్లింల ఓటు హక్కుపై వివాదం.. విశ్వ ఒక్కలిగ మహాసంస్థాన మఠం స్వామీజీపై కేసు

Chennai: హాయిగా ఊపిరి పీల్చుకోండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Nov 29 , 2024 | 06:04 PM