Congress: ఉమెన్స్ డే సందర్భంగా ప్రధాని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్న కాంగ్రెస్
ABN , Publish Date - Mar 08 , 2024 | 10:38 AM
అంతర్జాతీయ మహిళా దినోత్సవం(international Women's Day 2024) సందర్భంగా మోదీ ప్రభుత్వ హయాంలో శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెద్ద ఎత్తున తగ్గిపోయిందని కాంగ్రెస్ ఆరోపించింది. దీంతోపాటు ప్రధాని ఈ 5 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని కోరింది.
ప్రధాని నరేంద్ర మోదీ(narendra Modi) నేతృత్వంలోని ప్రభుత్వ హయాంలో కార్మిక శక్తిలో మహిళల వాటా క్రమంగా తగ్గుతుందని కాంగ్రెస్(congress) ఆరోపించింది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ బలహీనపడే అవకాశం ఉందని శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం(international Women's Day 2024) సందర్భంగా తెలిపింది. అంతేకాదు ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఈ ఐదు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని దేశంలోని మహిళలు కోరుతున్నట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జై రాం రమేష్ (jai ram ramesh) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.
1. మణిపూర్‌లో గత ఏడాది జరిగిన పలు నేరాల్లో అనేక మంది మహిళలకు(Womens) అవమానం జరిగింది. ఆ సమయంలో కొంత మంది మహిళలపై దాడులు చేసి నగ్నంగా ఊరేగించిన ఘటనలు కూడా వెలుగులోకి వచ్చాయి. కానీ ఈ విషయంలో ప్రధాని మోదీ ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఆ సమయంలో మణిపూర్‌లో ఎందుకు పర్యటించలేదని అడిగారు?
2. బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై మహిళా రెజ్లర్లు తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. కానీ ఈ విషయంపై ప్రధాని(prime minister) ఎందుకు మౌనంగా ఉన్నారని, ఈ అంశంపై ప్రధానమంత్రి వైఖరి ఏమిటని ప్రశ్నించారు.
3. దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్బణం(inflation) నుంచి దేశ ప్రజలను కాపాడేందుకు ప్రధాని వద్ద ఏమైనా ప్రణాళిక ఉందా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రశ్నించారు.
4. డాక్టర్ మన్మోహన్ సింగ్(manmohan singh) హయాం కంటే ఇప్పుడు శ్రామిక శక్తిలో మహిళల శాతం 20 శాతం తక్కువగా ఉందని కాంగ్రెస్ గుర్తు చేసింది. ఇది ఆర్థిక వ్యవస్థ దీర్ఘకాలిక సామర్థ్యాన్ని దెబ్బతీసే ధోరణి. మహిళలను ఆర్థిక ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడానికి ప్రధానికి ఏమైనా శక్తి ఉందా అని రమేష్ ప్రశ్నించారు. దాన్ని తిరిగి తీసుకురావడానికి ఏదైనా పరిష్కారం ఉందా? అన్యాయ యుగం లక్షణాలలో ఒకటైన తీవ్రమైన నిరుద్యోగ సంక్షోభం విషయంలో ఏదైనా చర్యలు తీసుకున్నారా అని అడిగారు. ఆ క్రమంలో ఉద్యోగాన్వేషణలో భాగంగా మహిళలకు ఉపాధిని లభించకుండా నిరుత్సాహపడుతున్నారని చెప్పారు.
5. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రధానమంత్రి ‘బేటీ బచావో బేటీ పఢావో(beti bachao beti padhao)’ పథకాన్ని ఎంతో ఆర్భాటంగా ప్రారంభించారు. అయితే ఈ పథకం బడ్జెట్‌లో దాదాపు 80 శాతం కేవలం ప్రకటనల కోసమే పెట్టినట్లు వెలుగులోకి వచ్చింది. ఆడపిల్లల భ్రూణహత్యలను అరికట్టడానికి, మహిళా విద్యను ప్రోత్సహించడానికి ప్రధానికి ఏదైనా అర్థవంతమైన దృక్పథం ఉందా అని రమేష్(jai ram ramesh) ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో భారతీయ మహిళలు ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారని.. బీజేపీని తొలగించి, ఆడపిల్లను రక్షించాలని రమేష్ కోరారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Womens Day: మహిళలకు ప్రధాని మోదీ కానుక.. సిలిండర్‌పై ధర తగ్గింపు.. ఎంతంటే..?