Share News

Haryana Assembly Elections: పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు సంప్రదింపులు

ABN , Publish Date - Sep 03 , 2024 | 07:57 PM

వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో వెళ్లేందుకు సమాయత్తమయ్యాయి.

Haryana Assembly Elections: పొత్తుపై కాంగ్రెస్, ఆప్ నేతలు సంప్రదింపులు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 03: వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో వెళ్లేందుకు సమాయత్తమయ్యాయి. అందులోభాగంగా ఆ యా పార్టీల అగ్రనేతలు కేసీ వేణుగోపాల్, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఈ రోజు రాత్రి కానీ.. బుధవారం ఉదయం కానీ భేటీ కానున్నారని సమాచారం.

Also Read: Bibhav Kumar Bail: స్పందించిన ఆప్ ఎంపీ స్వాతి


ఈ భేటీ ద్వారా ఎన్నికల్లో పోటీపై ఈ రెండు పార్టీలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశముందని తెలుస్తుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాలు తమకు కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ కొంత డైలమాలో పడినట్లు ఓ చర్చ సైతం సాగుతుంది. అదీకాక హరియాణాలో బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. ఆ క్రమంలో మరికొన్ని పార్టీలతో కలిసి ఈ ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలు సిద్దం చేసుకుంటుంది.

Also Read: Vinayaka Chavithi Special 2024: ఏ రాశి వారు ఏ నైవేద్యం పెట్టాలి. ఏ మంత్రం చదివి పూజించాలంటే..


అందులోభాగంగా సమాజవాదీ పార్టీతో సైతం పొత్తు పెట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేపట్టినట్లు తెలుస్తుంది. దీంతో ఆ పార్టీకి సైతం సీట్లు కేటాయించ వలసి ఉంది. అలాంటి వేళ 20 సీట్లు ఆప్‌కు కేటాయిస్తే.. అనంతరం చోటు చేసుకునే పరిణామాలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్లు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీల పొత్తు అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది.

Also Read: Uttar Pradesh: తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి.. సీఎం ఆదేశాలు


అదీకాక ఇండియా కూటమిలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, సమాజవాదీ తదితర పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి. అలాంటి వేళ.. సీట్ల అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది. ఇక 90 అసెంబ్లీ స్థానాలున్న హరియాణా అసెంబ్లీకి ఆక్టోబర్ 5వ తేదీన... అంటే ఒక దశలో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఆక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.

Also Read:RG Kar hospital: 8 రోజుల సీబీఐ కస్టడీకి ప్రొ. సందీప్ ఘోష్


2024 లోక్‌సభ ఎన్నికలు..

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో హరియాణాలో ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 10 లోక్‌సభ స్థానాల్లో 9:1 నిష్పత్తిలో కాంగ్రెస్, ఆప్‌లు అభ్యర్తులను బరిలో దింపాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయిదు సీట్లు కైవసం చేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేసిన కురుక్షేత్ర లోక్ ‌సభ స్థానాన్ని బీజపీ కైవసం చేసుకుంది. ఈ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా నవీన్ జిందాల్ బరిలొ నిలిచి గెలిచిన విషయం విధితమే.

Also Read: Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో 9 మంది మావోయిస్టులు మృతి

Read More National News and Latest Telugu New

Updated Date - Sep 03 , 2024 | 07:57 PM