Rahul Gandhi: మోదీజీ ఎందుకు సీరియస్‌గా ఉంటారు? రాహుల్ ప్రశ్నకు ప్రధాని ఏమన్నారంటే..?
ABN , Publish Date - Jul 01 , 2024 | 09:03 PM
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారంనాడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు ప్రధాని గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తనకు నేర్పించాయని మోదీ జవాబిచ్చారు.
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఎప్పుడూ సీరియస్‌గా ఎందుకు ఉంటారంటూ లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) సోమవారంనాడు లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ప్రధాని గట్టి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంపై చర్య సందర్భంగా రాహుల్ ఈ ప్రశ్న లేవనెత్తారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి వంటి బీజేపీ నేతలు తన పట్ల ఎంతో సుహృద్భావంతో ఉంటారని, మోదీ మాత్రం ఎప్పుడూ సీరియస్‌గానే ఉంటారని, ముఖంలో చిరునవ్వే కనిపించదని అన్నారు. ఈరోజు ఉదయం కూడా రాజ్‌నాథ్ తనను గ్రీట్ చేశారని, మోదీ వచ్చేసరికి అదంతా ఆగిపోయిందని, ఆయన (మోదీ) చాలా సీరియస్‌గా ఉన్నారని, ముఖంగాలో చిరునవ్వే లేదని అన్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఆయనంటే భయపడే వాతావరణం కనిపిస్తుందని ఆరోపించారు.
Om Birla: మోదీకి తలవంచడంపై ఓం బిర్లా ఏమన్నారంటే..?
కాగా, రాహుల్ సందేహానికి సభలోనే ఉన్న మోదీ అంతే సమర్ధవంతంగా సమాధానమిచ్చారు. ప్రతిపక్ష నేతను సీరియస్‌గా తీసుకోవాలని ప్రజాస్వామ్యం, రాజ్యాంగం తనకు నేర్పించాయని అన్నారు., దీంతో అధికార పక్షం సభ్యులు బల్లలు చరుస్తూ నవ్వులు చిందించారు.
మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..