Fengal Cyclone: ఫెంగల్ తుపాను బీభత్సం.. 7 రాష్ట్రాలకు హెచ్చరిక, స్కూళ్లు, కాలేజీలు బంద్
ABN , Publish Date - Nov 30 , 2024 | 07:52 AM
ఫెంగల్ తుపాను ఈరోజు పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత 7 రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు జారీ చేశారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను (Cyclone Fengal) విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు పుదుచ్చేరిలోని కారైకల్, తమిళనాడులోని మహాబలిపురం తీరాన్ని ఈ తుపాను తాకనుంది. దీని ప్రభావంతో గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వెదర్ రిపోర్ట్ అధికారులు వెల్లడించారు. ఫెంగల్ తుపాను ఈరోజు పుదుచ్చేరి తీరాన్ని తాకిన తర్వాత 7 రాష్ట్రాల్లో వినాశనం కలిగించవచ్చు. ఈ క్రమంలో కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు (rains) కురుస్తాయని పేర్కొన్నారు. దీంతో పాఠశాలలు, స్కూళ్లను మూసివేశారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచనలు జారీ చేశారు.
ఇది రెండో తుపాను
ఈ తుపాను నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఈరోజు తమిళనాడు, పుదుచ్చేరిలో పాఠశాలలు, కళాశాలలు బంద్ చేశారు. వర్షాకాలం ముగిసిన తర్వాత భారతదేశాన్ని ప్రభావితం చేసే రెండవ తుఫాను ఇది కావడం విశేషం. అంతకుముందు అక్టోబర్ చివరి రోజుల్లో తుపాను దానా వచ్చింది. ఇది ఒడిశా, మహారాష్ట్రలో విధ్వంసం సృష్టించింది. ఇప్పుడు నవంబర్ నెలలో ఫెంగల్ తుఫాను విధ్వంసం సృష్టించడానికి సిద్ధంగా ఉంది. దీని కారణంగా ప్రస్తుతం మొత్తం 7 రాష్ట్రాలు హై అలర్ట్‌లో ఉన్నాయి.
తుపానును ఎదుర్కొనేందుకు సన్నాహాలు
దీంతో తమిళనాడు, పుదుచ్చేరి ప్రభుత్వాలు సహాయ శిబిరాలు ఏర్పాటు చేశాయి. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. ఈ నగరాల్లో ఎలాంటి పరీక్షలు లేదా కోచింగ్ తరగతులు ఉండవు. తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 30 మధ్యాహ్నం నుంచి ఈస్ట్ కోస్ట్ రోడ్ (ECR), పాత మహాబలిపురం రోడ్ (OMR) సహా ప్రధాన రహదారులపై ప్రజా రవాణా సేవలను నిలిపివేసింది. బీచ్‌కి దగ్గరగా వెళ్లే రహదారులు తాత్కాలికంగా మూసివేయబడతాయి.
కంపెనీల ఆదేశాలు
ఫెంగల్ తుపాను సంభవించిన నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు వీలుగా నవంబర్ 30న తమ ఉద్యోగులను ఇంటి నుంచి పని చేసేందుకు అనుమతించాలని ఐటీ కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. తమిళనాడు రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 2,229 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. తిరువారూరు, నాగపట్నం జిల్లాల్లో ఇప్పటి వరకు 164 కుటుంబాలకు చెందిన 471 మందిని సహాయక కేంద్రాల్లో ఉంచారు. చెన్నై, కడలూరు, మైలదుత్తురైలలో వరదలు వచ్చే అవకాశం ఉన్నందున స్థానిక అధికారులు మోటార్ పంపులు, జనరేటర్లు, పడవలతో సహా అవసరమైన పరికరాలను కూడా మోహరించారు.
ఇవి కూడా చదవండి:
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bank Holidays: వచ్చే నెలలో 17 రోజులు బ్యాంకులు బంద్.. కారణమిదే..
Recharge Plans: 5 నెలల చౌక ప్లాన్ ప్రకటించిన BSNL.. మిగతా వాటితో పోలిస్తే ధర..
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Read More National News and Latest Telugu News