Share News

Air Pollution: 500 దాటేసిన రాజధాని గాలి కాలుష్యం.. డేంజర్ జోన్‌లో ప్రజల జీవనం

ABN , Publish Date - Nov 20 , 2024 | 09:19 AM

ఢిల్లీలో వరుసగా ఆరో రోజు కూడా గాలి కాలుష్యం తీవ్రమైన స్థాయిలోనే ఉంది. దీంతోపాటు ఉత్తర భారతదేశంలో చలి ప్రభావం కూడా పెరగడంతో వైద్యులు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

Air Pollution: 500 దాటేసిన రాజధాని గాలి కాలుష్యం..  డేంజర్ జోన్‌లో ప్రజల జీవనం
Delhi air pollution

దేశ రాజధాని ఢిల్లీ (delhi) తోపాటు దాని చుట్టుపక్కల కూడా అనేక చోట్ల గాలి కాలుష్యం క్రమంగా పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ గాలి నాణ్యత బుధవారం ఉదయం వరుసగా ఆరోరోజు 463గా నమోదై 'తీవ్రమైన ప్లస్' స్థాయికి చేరింది. ఇంకొన్ని చోట్లు ఈరోజు (నవంబర్ 20) AQI 500 కంటే ఎక్కువ నమోదైంది. రోహిణి, వజీర్‌పూర్, ఆనంద్ విహార్, అశోక్ విహార్, బవానా, నరేలా, ముండ్కా, అలీపూర్, జహంగీర్ పురి, సోనియా విహార్, అశోక్ విహార్ వంటి స్టేషన్‌ల 24 గంటల సగటు AQI 450 కంటే ఎక్కువగా ఉంది. ఇంతలో కాళింది కుంజ్ సమీపంలోని యమునా నదిపై విషపూరిత నురుగు తేలుతూ కనిపించింది.


రెండు రోజుల్లో

ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతోపాటు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 24°C, కనిష్ట ఉష్ణోగ్రత 12°Cగా ఉండనుంది. దట్టమైన పొగమంచు, చలి గాలులతో తీవ్ర కాలుష్యం ఏర్పడే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ హెచ్చరించింది. బలమైన గాలుల కారణంగా AQI తగ్గుదల ఉండనుంది. మరో ఒకటి రెండు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 10 డిగ్రీల కంటే తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.


119 విమానాలు ఆలస్యం

ఇప్పటికే ఢిల్లీలో స్టేజ్ 4 నిబంధనలు అమలు చేస్తున్నారు. వాహనాల నిషేధంపై కాలుష్య నియంత్రణలు విధించబడ్డాయి. పాఠశాలలు కూడా మూసివేశారు. దీంతో అక్కడి నివాసితులను ఈ కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విజిబిలిటీ పడిపోయింది. దీంతో 119 విమానాలు ఆలస్యంగా నడుస్తుండగా, 6 రద్దు చేయబడ్డాయని ఫ్లైట్‌ రాడార్ తెలిపింది.

మరోవైపు భారతదేశంలోని ఉత్తర ప్రాంతాలలో ముఖ్యంగా యూపీ, బీహార్‌లలో ఉదయం, సాయంత్రం చలి ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ప్రజలు వెచ్చని దుప్పట్లు ఉపయోగించడం అవసరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో నేడు కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది.


దక్షిణ భారతదేశంలో వర్షాలు పడే అవకాశం

ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. పొగమంచు ప్రభావం ఢిల్లీ-NCR, ఇతర ఉత్తర ప్రాంతాలలో కూడా కొనసాగుతుంది. ఇదే సమయంలో భారతదేశంలోని దక్షిణ ప్రాంతాలలో ముఖ్యంగా తమిళనాడు, కేరళ, లక్షద్వీప్‌లలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెదర్ రిపోర్ట్ తెలిపింది. తమిళనాడు తీర ప్రాంతాల్లో ఒకటి రెండు సార్లు భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. దీంతోపాటు కర్ణాటకలోని దక్షిణ ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురియనున్నాయి.


ఇవి కూడా చదవండి:

Chrome Browser: గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సేల్ చేస్తున్నారా.. అమెరికా ప్రభుత్వం..

Viral News: మీటింగ్‌కు రాలేదని 90% ఉద్యోగులను తొలగించిన సీఈఓ.. నెటిజన్ల కామెంట్స్


PAN Aadhaar: పాన్ ఆధార్ ఇంకా లింక్ చేయలేదా.. ఇప్పుడే చేసుకోండి, గడవు సమీపిస్తోంది..

Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..

Read More Business News and Latest Telugu News

Updated Date - Nov 20 , 2024 | 09:21 AM