Share News

Kejriwal : ఒక్కసారిగా 4.5 కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. టెన్షన్‌లో ఆప్!

ABN , Publish Date - Apr 03 , 2024 | 10:17 AM

ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 21 అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కిలోలు తగ్గారని అన్నారు.

Kejriwal : ఒక్కసారిగా 4.5 కిలోల బరువు తగ్గిన కేజ్రీవాల్.. టెన్షన్‌లో ఆప్!

ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam)కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్(Delhi CM Arvind Kejriwal) అనారోగ్యంతో ఉన్నారని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) వర్గాలు తెలిపాయి. దీంతో మార్చి 21 అరెస్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 4.5 కిలోలు తగ్గారని వెల్లడించారు. గత కొన్ని రోజులుగా ఢిల్లీ సీఎం రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు లోనవుతుందని, ఆయన షుగర్ లేవల్స్ 50కి చేరుకున్నాయని ఆప్ నేతలు అన్నారు. మరోవైపు తీహార్ జైలులో ఉన్న అధికారులు, అతను బాగానే ఉన్నారని, జైలు వైద్యులు అతని ఆరోగ్య పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు.

ఈ అంశంపై ఆప్ మంత్రి అతిషి కూడా సోషల్ మీడియా(social media) వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అరవింద్ కేజ్రీవాల్ మధుమేహ వ్యాధిగ్రస్థుడని, నేడు బీజేపీ ప్రభుత్వం జైల్లో పెట్టి ఆయన ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలో పడేస్తోందని ఆరోపించారు. అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, కేజ్రీవాల్ 24 గంటలూ దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని తెలిపారు. అరెస్ట్ అయినప్పటి నుంచి అరవింద్ కేజ్రీవాల్ బరువు 4.5 కిలోలు తగ్గడం చాలా ఆందోళనకరమని వెల్లడించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు మరో కీలక అరెస్ట్..


ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన లాండరింగ్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ(ED) ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌(Arvind Kejriwal)ను మార్చి 21న అరెస్టు చేసింది. దీని తర్వాత, కేజ్రీవాల్ ED కస్టడీలో ఉన్నారు. ఆపై కోర్టు అతన్ని ఏప్రిల్ 15 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. జ్యుడీషియల్ కస్టడీకి పంపిన తర్వాత, కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోని నంబర్ 2లో ఉంచారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ(delhi liquor scam) తయారు, అమలులో జరిగిన అవకతవకలకు అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన కుట్రదారు అని ఈడీ(ED) పేర్కొంది. దీంతో పాటు పలువురు ఆప్ నేతల ప్రమేయం కూడా ఉన్నట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ చెబుతోంది. ఈ కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా జైలులో ఉన్నారు. ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌కు ఈ కేసులో ఉపశమనం ఇస్తూ కోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో సింగ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి తమకు అభ్యంతరం లేదని ఈడీ తెలిపింది.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: IPL 2024: నేటి DC vs KKR మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారు..ప్రిడిక్షన్ ఎలా ఉందంటే?

Updated Date - Apr 03 , 2024 | 10:41 AM