Delhi excise Policy: కేజ్రీవాల్ పీఏ, ఆప్ ఎమ్మెల్యేను ప్రశ్నించిన ఈడీ
ABN , Publish Date - Apr 08 , 2024 | 03:25 PM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ వైభవ్ కుమార్, ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ లను ఈడీ సోమవారంనాడు విచారించింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ (Delhi Excise pollicy)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరైట్ (ED) దూకుడు కొనసాగుతోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పీఏ (PA) వైభవ్ కుమార్ (Bidhav Kumar), ఆప్ ఎమ్మెల్యే దుర్గేష్ పాఠక్ (Durgesh Pathak) లను ఈడీ సోమవారంనాడు విచారించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల కింద కుమార్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. గతంలో కూడా ఈ ఇద్దరినీ ఈడీ ప్రశ్నించింది.
Lok Sabha Elections: ఆప్ 'జేల్ కా జవాబ్ ఓట్ సే' ప్రచారం షురూ
దుర్గేష్ పాఠక్ సోమవారం ఉదయం ఢిల్లీలోని ఈడీ ప్రధానకార్యాలయానికి చేరుకుని ఈడీ ముందు హాజరయ్యారు. 2022 సెప్టెంబర్‌లో ఆప్ నేత విజయ్ నాయర్ ఇంటిపై ఈడీ దాడులు జరిపినట్టు దుర్గేష్ పాఠక్ అక్కడే ఉన్నారు. అప్పుడు పాఠక్ ఫోనును ఈడీ స్వాధీనం చేసుకుంది. కాగా, జైలుకు వెళ్లిన ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సంఘీభావంగా ఆదివారంనాడు నిరాహార దీక్ష చేపట్టిన ఆ పార్టీ సరికొత్త థీమ్‌తో ఎన్నికల ప్రచారానికి సోమవారం శ్రీకారం చుట్టింది. కేజ్రీవాల్‌ను జైలుకు పంపినందుకు ఓటుతో సమాధానం చెప్పండంటూ ''జైల్ కా జవాబ్ ఓట్ సే'' (Jail Ka Jawab Vote Se) ప్రచారాన్ని ప్రారంభించింది. 'ఆప్' పోటీచేస్తున్న నాలుగు లోక్‌సభ స్థానాల్లోనూ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తారని 'ఆప్' నేతలు మీడియా సమావేశంలో వెల్లడించారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం క్లిక్ చేయండి