Share News

Shocking incident: బిల్డర్ చెంపదెబ్బతో భవంతిపై నుంచి కిందపడిన మైనర్ బాలిక

ABN , Publish Date - Jul 27 , 2024 | 08:42 PM

క్రిమినల్ చట్టాలను ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తున్నా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారంనాడు ఇదే తరహా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక టీనేజ్ అమ్మాయిపై బిల్డర్ చేయి చేసుకున్నాడు. ఒళ్లు తెలియని ఆవేశంతో ఆమె చెంప పగడకొట్టడంతో ఒక్కసారిగా ఆమె బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయింది.

Shocking incident: బిల్డర్ చెంపదెబ్బతో భవంతిపై నుంచి కిందపడిన మైనర్ బాలిక

న్యూఢిల్లీ: క్రిమినల్ చట్టాలను ప్రభుత్వాలు కట్టుదిట్టం చేస్తున్నా మహిళలపై ఆగడాలు ఆగడం లేదు. దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో శనివారంనాడు ఇదే తరహా షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక టీనేజ్ అమ్మాయిపై బిల్డర్ చేయి చేసుకున్నాడు. ఒళ్లు తెలియని ఆవేశంతో ఆమె చెంప పగడకొట్టడంతో ఒక్కసారిగా ఆమె బిల్డింగ్ పైనుంచి కింద పడిపోయింది. తీవ్ర బాధతో ఆమె విలవిల్లాడం చూసిన స్థానికులు వెంటనే ఆమెకు సహాయంగా వచ్చారు. ఘటన అనంతరం బిల్డర్ పరారవ్వడంతో పోలీసులు వెంటనే ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు ఆస్తి తగాదానే కారణంగా అనుమానిస్తున్నారు.


కాగా, బిల్టర్ దౌర్జన్యానికి సంబంధించి వీడియో వెలుగులోకి రావడంతో అది ఒక్కసారిగా వైరల్ అయింది. కేసు రిజిస్టర్ చేసి నిందితుడి కోసం గాలింపు బృందాలను పంపినట్టు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Viral Video: ట్రైన్‌ పట్టుకొని స్టంట్ చేశాడు.. కాలు, చెయ్యి పోగొట్టుకున్నాడు


4 శాతం పెరిగిన నేరాలు

నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో రికార్డుల ప్రకారం ఇండియాలో మహిళలపై నేరాలు 4 శాతం పెరిగాయి. మెట్రో నగరాల్లో వరుసగా మూడోసారి ఢిల్లీలో అత్యధికంగా 14,158 కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. ప్రతి లక్ష మంది మహిళలకు 186.9 నేరాలు నమోదవుతున్నాయి. మొత్తం నేరాల్లో ఈ తరహా నేరాలు 31.20 శాతంగా ఎన్‌సీఆర్‌బీ డాటా చెబుతోంది.

Read Latest National News and Telugu News

Updated Date - Jul 27 , 2024 | 08:46 PM