Share News

Delhi Coaching Centre: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

ABN , Publish Date - Aug 02 , 2024 | 05:18 PM

ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్‌ సెల్లార్‌ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు శుక్రవారం ఆదేశాలిచ్చింది.

Delhi Coaching Centre: సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ: ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్‌ సెల్లార్‌ను వరద ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi High court) శుక్రవారం ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తును మానిటర్ చేసేందుకు, సకాలంలో దర్యాప్తు పూర్తి చేసేందుకు ఒక ఆఫీసర్‌ను నియమించాలని కూడా విజిలెన్స్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.


న్యూఢిల్లీ: ఓల్డ్ రాజేందర్ నగర్‌లోని రావూస్ ఐఎఏఎస్ స్టడీ సర్కిల్‌ సెల్లార్‌ను వరద ప్రవాహం ప్రవాహం ముంచెత్తి ముగ్గురు సివిల్ సర్వీసెస్ విద్యార్థులు మృతి చెందిన ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసు దర్యాప్తును సీబీఐ (CBI) కి బదిలీ చేస్తూ ఢిల్లీ హైకోర్టు (Delhi High court) శుక్రవారం ఆదేశాలిచ్చింది. సీబీఐ దర్యాప్తును మానిటర్ చేసేందుకు, సకాలంలో దర్యాప్తు పూర్తి చేసేందుకు ఒక ఆఫీసర్‌ను నియమించాలని కూడా విజిలెన్స్ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది.


''ఘటన జరిగిన తీరు, విచారణపై ప్రజలకు ఎలాంటి అపోహలకు లేకుండా చూసేందుకు ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నాం'' అని కోర్టు పేర్కొంది. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ తన సూపర్‌వైజరీ పవర్స్‌తో దర్యాప్తు పర్వవేక్షణకు ఒక సభ్యుని నియమించాలని ఆదేశించింది. ఢిల్లీలో మురుగుకాలువల వంటి ఫిజికల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ తగినంతగా లేవని, నిర్వహణ కూడా దయనీయంగా ఉందని, సివిల్ ఎజెన్సీల్లో చిత్తశుద్ధి లోపించడం వల్లే ఇటీవల విషాద ఘటనలకు కారణమవుతోందని కోర్టు అభిప్రాయపడింది.

Delhi: నిన్న పైనుంచి లీక్.. నేడు ఏకంగా వరదే.. కొత్త పార్లమెంట్‌ భవనంలో పరిస్థితి ఇదీ!


రాజేందర్ నగర్‌లోని కోచింగ్ సెంటర్‌లోకి వరద నీరు ముంచెత్తి ఈనెల 27వ తేదీ సాయంత్రం శ్రేయ యాదవ్, తానియా సోని, నెవిన్ డాల్విన్ అనే ముగ్గురు విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి వివిధ కోచింగ్ సంస్థల్లో చదువుతున్న విద్యార్థులు నిరసనల బాట పట్టారు. తమ ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తున్న కోచింగ్ సెంటర్లలో భద్రతా చర్యలు మెరుగుపరచాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Latest National News And Telugu News

Updated Date - Aug 02 , 2024 | 05:24 PM