Share News

High Court: అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతకు షాకిచ్చిన హైకోర్టు..కారణమిదే

ABN , Publish Date - Jun 15 , 2024 | 12:48 PM

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భార్య సునీతా కేజ్రీవాల్‌కు(Sunita Kejriwal) హైకోర్టు(high court) నుంచి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసు కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్‌తో పాటు ఇతరులకు హైకోర్టు నోటీసులు(notices) పంపించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ తన పక్షాన్ని కోర్టులో హాజరుపరుస్తున్న వీడియోను(video) తొలగించాలని హైకోర్టు కోరింది.

High Court: అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతకు షాకిచ్చిన హైకోర్టు..కారణమిదే
high court Notice to Sunita Kejriwal

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) భార్య సునీతా కేజ్రీవాల్‌కు(Sunita Kejriwal) హైకోర్టు(high court) నుంచి షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కేసు కోర్టు ప్రొసీడింగ్స్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో ఢిల్లీ సీఎం సతీమణి సునీతా కేజ్రీవాల్‌తో పాటు ఇతరులకు హైకోర్టు నోటీసులు(notices) పంపించింది. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ తన పక్షాన్ని కోర్టులో హాజరుపరుస్తున్న వీడియోను(video) తొలగించాలని హైకోర్టు కోరింది. నిజానికి ఈ వీడియో కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన సమయంలో కేజ్రీవాల్ తన పక్షాన్ని కోర్టు ముందు హాజరుపరిచిన సమయానికి చెందినది.

ఆ పోస్ట్‌లను తీసివేయాలని సునీతా కేజ్రీవాల్‌తో పాటు మరో ఐదుగురు వ్యక్తిగత ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఆ రోజు రికార్డ్ చేసిన వీడియోకు సంబంధించి ఏవైనా పోస్ట్‌లు లేదా రీపోస్ట్‌లను తొలగించాలని సోషల్ మీడియా కంపెనీలను కూడా ఆదేశించింది. జూలై 9లోగా సమాధానం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసింది.


అయితే అనేక సోషల్ మీడియా(social media) హ్యాండిళ్లలో పేర్కొన్న వీడియోలను తొలగించాలని న్యాయవాది వైభవ్ సింగ్ ఈ పిటిషన్‌ను(petition) దాఖలు చేశారు. మార్చి 28న కేజ్రీవాల్ రౌస్ అవెన్యూ కోర్టును ఉద్దేశించి వాదనల తర్వాత, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన పలువురు సోషల్ మీడియా హ్యాండిళ్లలో కోర్టు కార్యకలాపాల వీడియో/ఆడియో రికార్డింగ్‌లు పంచుకున్నారని సింగ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. మార్చి 28న ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు(Delhi liquor policy case)కు సంబంధించి ఈడీ(ED) కేజ్రీవాల్‌ను కోర్టు ముందు హాజరుపరిచింది.


కేజ్రీవాల్ వ్యక్తిగతంగా కోర్టును ఉద్దేశించి మాట్లాడారు. ఆ క్రమంలో బీజేపీ కోసం ఈడీ దోపిడీ రాకెట్ నడుపుతోందని ఆరోపించారు. సింగ్ ప్రకారం విచారణ ముగిసిన వెంటనే చాలా సోషల్ మీడియా హ్యాండిల్స్ కోర్టు కార్యకలాపాలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్‌లను పోస్ట్ చేయడం, రీపోస్ట్ చేయడం, ఫార్వార్డ్ చేయడం, షేర్ చేయడం ప్రారంభించాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఢిల్లీ హైకోర్టు రూల్స్(court proceedings) 2021 ప్రకారం వీడియో కాన్ఫరెన్స్ కోసం కోర్టు కార్యకలాపాలను రికార్డ్ చేయడం నిషేధించబడిందని, ఆ వీడియోలను వైరల్ చేయడం న్యాయవ్యవస్థ, న్యాయమూర్తుల ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నమని సింగ్ వెల్లడించారు.


ఇది కూడా చదవండి:

Modi And Meloni: నరేంద్ర మోదీతో కలిసి నవ్వుతూ సెల్ఫీ దిగిన మహిళా ప్రధాని


Viral News: ఆన్‌లైన్‌లో స్మార్ట్‌ఫోన్ ఆర్డర్ చేశారు.. తీరా పార్సిల్ ఓపెన్ చేస్తే షాక్..

EPFO Withdrawal Rule: పీఎఫ్ విత్ డ్రా రూల్స్ మారాయ్.. వెంటనే చెక్ చేసుకోండి!


Read Latest National News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 12:55 PM