Delhi : మంత్రివర్గంలోలంబాడీలకు చోటివ్వాలి
ABN , Publish Date - Jul 28 , 2024 | 04:29 AM
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది.
లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్
న్యూఢిల్లీ, జూలై 27(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో తమ సామాజికవర్గానికి చోటు కల్పించాలని లంబాడీ సంఘాల జేఏసీ డిమాండ్ చేసింది. తమ వర్గానికి చెందిన నలుగురు కాంగ్రె్‌సలో ఎమ్మెల్యేలుగా ఉన్నారని, వారిలో ఖచ్చితంగా ఒక్కరికి మంత్రి పదవి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం ఢిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో లంబాడీ సంఘాల జేఏసీ అధ్వర్యంలో లంబాడీ నేతలు నిరసన చేపట్టారు.