Viral Video: ఉద్రిక్తంగా మారిన JNU.. తన్నుకున్న రెండు గ్రూపులు
ABN , Publish Date - Mar 01 , 2024 | 01:03 PM
జేఎన్‌యూలో మరోసారి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాత్రంతా ఇరువర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. రెండు విద్యార్థి సంఘాలు పరస్పరం హింసకు పాల్పడ్డాయి.
ఢిల్లీ(Delhi)లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU) క్యాంపస్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. వామపక్ష, రైట్‌వింగ్ విద్యార్థుల మధ్య జరిగిన గొడవ కాస్తా తన్నుకునే వరకు వెళ్లింది. జేఎన్‌యూలో గురువారం(ఫిబ్రవరి 29) అర్థరాత్రి రెండు విద్యార్థి సంఘాల(student groups) మధ్య భీకర గొడవ జరిగింది. దీంతో రెండు విద్యార్థి గ్రూపులు తన్నుకున్నాయి. ఆ క్రమంలో ఒకరిపై ఒకరు కర్రలతో దాడి(attack) చేసుకున్నారు. ఈ దాడి ఘటనకు సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతున్న వీడియోలో పార్కింగ్ ఏరియాలో వందలాది మంది విద్యార్థులు గుమిగూడి వాగ్వాదానికి దిగడం కనిపిస్తోంది. ఆ తర్వాత ఒకరిపై ఒకరు కిక్‌లు, పంచ్‌లతో దాడి చేసుకున్నారు. ఓ విద్యార్థి రెండు చేతులతో సైకిల్ పైకెత్తి దాడి చేస్తున్న దృశ్యం కూడా వీడియోలో కనిపిస్తుంది. చాలా మంది విద్యార్థులు కర్రలతో కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత అక్కడ తొక్కిసలాట జరిగింది. విద్యార్థి సంఘం ఎన్నికలకు ముందే రెండు గ్రూపుల విద్యార్థులు పరస్పరం ఘర్షణ పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ముగ్గురు విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా వారిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి(Hospital) తరలించారు. అయితే ప్రస్తుతం ఈ ఘటనపై ఎవరూ కూడా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేయలేదని పోలీసులు(police) తెలిపారు.
మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Lok Sabha Elections: ఎన్నికల బందోబస్తుపై ఈసీ నజర్.. పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ
వామపక్ష విద్యార్థులు ఈ మొత్తం ఘటనను ఏబీవీపీ(ABVP) గూండాయిజం అని అభివర్ణించగా, మితవాద విద్యార్థులు(students) క్యాంపస్‌పై నక్సలైట్ల దాడిగా అభివర్ణిస్తున్నారు. ఈ క్యాంపస్‌లో విద్యార్థి సంఘం ఎన్నికలకు సన్నాహాలు 4 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతున్నాయి. అంతకుముందు ఫిబ్రవరి 10న కూడాజేఎన్‌యూలో విద్యార్థి సంఘాల సభ్యుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు.