Share News

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం.. ఈడీపై నిప్పులు చెరిగిన ఆప్

ABN , Publish Date - Mar 25 , 2024 | 06:49 PM

మద్యం కుంభకోణానికి (Liquor Scam) సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న తన పాత ఫోన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వదిలించుకున్నారని ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వాదనల్ని తోసిపుచ్చిన ఆప్.. ఈ విచారణ బీజేపీ (BJP) కార్యాలయం నుంచి జరుగుతోందంటూ ఆరోపించింది.

Arvind Kejriwal: కేజ్రీవాల్ ఫోన్ మిస్సింగ్ వ్యవహారం.. ఈడీపై నిప్పులు చెరిగిన ఆప్

మద్యం కుంభకోణానికి (Liquor Scam) సంబంధించిన రికార్డులను కలిగి ఉన్న తన పాత ఫోన్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వదిలించుకున్నారని ఎన్స్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) చేసిన ఆరోపణలపై ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) సోమవారం తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ వాదనల్ని తోసిపుచ్చిన ఆప్.. ఈ విచారణ బీజేపీ (BJP) కార్యాలయం నుంచి జరుగుతోందంటూ ఆరోపించింది. బీజేపీకి ఈడీ రాజకీయ భాగస్వామి అని వ్యాఖ్యానించింది.

Read Also: మా నాయకుడిని జైలులో పెట్టారు.. మేము హోలీ ఆడము.. అతిశి కీలక ప్రకటన

ఈడీ ఆరోపణలపై ఢిల్లీ మంత్రి అతిషి సింగ్ (Atishi Singh) మాట్లాడుతూ.. ‘‘ఈడీకి ఏదైనా చెప్పాలంటే, వాళ్లు ఛార్జిషీట్ దాఖలు చేసి, న్యాయమూర్తి ముందు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. దేశంలోని ‘రాజ్యాంగం’ (Constitution) , ‘చట్టం’ (Law) ఈడీ అధికారులకు కొంత ప్రత్యేక ఇక్తిని ఇచ్చాయన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘించవద్దని, చంపొద్దని సూచించారు. ఈడీ అనేది బీజేపీకి ఏమాత్రం అనుబంధ సంస్థ కాదని.. ఈ దేశ చట్టాల ప్రకారం సృష్టించబడిన స్వతంత్ర దర్యాప్తు సంస్థ అని ఆమె పేర్కొన్నారు. కాబట్టి.. రాజ్యాంగం, చట్టానికి లోబడి దర్యాప్తు చేపట్టాలని సూచించారు.


అంతకుముందు కూడా.. కేజ్రీవాల్ అరెస్ట్‌పై (Kejriwal Arrest) అతిషి తారాస్థాయిలో విజృంభించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయించి కేజ్రీవాల్‌ను అరెస్ట్‌ చేయించిందని, సరైన ఆధారాలు లేకపోయినా ఆయన్ను జైల్లో పెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ నేతలు ఒక్క కేజ్రీవాల్‌ను జైల్లో పెడితే.. వేల మంది కేజ్రీవాల్‌లు పుట్టుకొస్తారని ఉద్ఘాటించారు. కేజ్రీవాల్ కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక ఆలోచన అని, ఆయన నుంచి ప్రేరణ పొంది దేశంలో ఎంతోమంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారని అతిషి చెప్పుకొచ్చారు.

Read Also: వయనాడ్ నుంచి రాహుల్‌తో తలపడే బీజేపీ అభ్యర్థి ఎవరంటే?

ఇదిలావుండగా.. రెండేళ్ల క్రితం మద్యం కుంభకోణం జరిగినప్పుడు కేజ్రీవాల్ ఉపయోగించిన ఫోన్ మిస్ అయిందని ఏజెన్సీ వర్గాలు ఆదివారం తెలిపాయి. దీనిపై తాము ప్రశ్నించగా.. ఆ ఫోన్ ఎక్కడుందో తనకు తెలియదని ఢిల్లీ సీఎం బదులిచ్చారని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు కౌంటర్‌గానే అతిషి పైవిధంగా బదులిచ్చారు. ఒక కేసు విచారణలో ఉన్నప్పుడు ఇలా బహిరంగ ప్రకటనలు చేయడం తగదని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 25 , 2024 | 06:49 PM