Delhi Water Crisis: రాజధానిలో నీటి సమస్య తీవ్రం..పైపులైన్లకు రక్షణ కల్పించాలని పోలీసులకు లేఖ
ABN , Publish Date - Jun 16 , 2024 | 12:58 PM
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి అతిషి(Atishi) ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా(Sanjay Arora)కు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైపులైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు.
దేశ రాజధాని ఢిల్లీ(delhi)లోని పలు ప్రాంతాల్లో నీటి కొరత మరింత పెరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ మంత్రి అతిషి(Atishi) ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరా(Sanjay Arora)కు లేఖ రాయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ లేఖలో ప్రధాన పైపులైన్లకు భద్రతను కల్పించాలని అతిషి కోరారు. ఢిల్లీలో నీటి ఎద్దడి నెలకొనడంతో నీటి సరఫరాకు అంతరాయం కలిగించేందుకు పలువురు కుట్ర పన్నుతున్నారని ఢిల్లీ నీటి పారుదల శాఖ మంత్రి అతిషి అన్నారు.
ఆ క్రమంలో నీటి పైప్‌లైన్‌ను కత్తిరించడం ద్వారా నీటి ఎద్దడిని మరింత తీవ్రం చేసేందుకు కుట్రలో చేస్తున్నట్లు వెల్లడించారు. ఇటివల ఓ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ సంజయ్ అరోరాకు లేఖ రాశారు.
అతిషి ఢిల్లీ పోలీసులకు రాసిన లేఖలో ఢిల్లీ జల్ బోర్డ్ పెట్రోలింగ్ బృందం దక్షిణ ఢిల్లీ రైజింగ్ మెయిన్ పైప్‌లైన్‌లో(pipelines) గర్హి మెండు ట్రాన్స్ఫార్మర్ సమీపంలో పెద్ద లీకేజీని గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రాథమిక దర్యాప్తులో 5 375 మి.మీ. బోల్ట్, 12 అంగుళాల బోల్ట్‌ను ఎవరో కత్తిరించారని తెలిపారు. అంతేకాదు ఢిల్లీలో నీటి సమస్యను పెంచడానికి కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఇలాంటి క్రమంలో రాబోయే 15 రోజుల పాటు ప్రధాన పైప్లైన్లకు పెట్రోలింగ్, భద్రత కోసం పోలీసు సిబ్బందిని నియమించాలని పోలీస్ కమిషనర్‌ను కోరారు.
ఆ క్రమంలో ఢిల్లీ జల్‌బోర్డు ఆ వాటర్ పైప్‌లైన్(pipelines) మరమ్మతులు చేసేందుకు ఆరు గంటల సమయం పట్టిందని లేఖలో స్పష్టం చేశారు. ఆ సమయంలో దక్షిణ ఢిల్లీకి నీటి సరఫరా నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు అన్నారు. అంతేకాదు పైప్‌లైన్ ధ్వంసం కారణంగా ఈరోజు దక్షిణ ఢిల్లీకి దాదాపు 25 శాతం తక్కువ నీరు చేరిందన్నారు. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఎండ వేడిమితో చాలా ప్రాంతాల్లో నీటి ఎద్దడి మరింత తీవ్రమైంది. నీటి కొరత కారణంగా(Delhi water crisis) ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కూడా తారాస్థాయికి చేరుకోవడం విశేషం.
ఇది కూడా చదవండి:
Elon Musk: ఈవీఎంల గురించి ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు..ఏమన్నారంటే
Open Fire: పార్కులో కాల్పులు.. 10 మందికి గాయాలు!
Ganga Dussehra 2024: గంగా దసరాకు పోటెత్తిన భక్తులు..ఈ రోజు ఏం చేస్తారు
Read Latest National News and Telugu News