Share News

Weather: నిప్పుల కుంపటి.. 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..

ABN , Publish Date - May 29 , 2024 | 05:59 PM

Record Breaking Temperature in Delhi: ఉత్తర భారతంలో(North India) భానుగు భగభగ మండిపోతున్నాడు. భారీ ఉష్ణోగ్రతలతో(Highest Temperature) ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతే ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు అదికాస్తా 50కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో(New Delhi) ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.

Weather: నిప్పుల కుంపటి.. 50 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు..
Delhi Weather

Record Breaking Temperature in Delhi: ఉత్తర భారతంలో(North India) భానుగు భగభగ మండిపోతున్నాడు. భారీ ఉష్ణోగ్రతలతో(Highest Temperature) ఉత్తరాది ప్రజలు అల్లాడిపోతున్నారు. 40 డిగ్రీల ఉష్ణోగ్రతే ఎక్కువ అనుకుంటే.. ఇప్పుడు అదికాస్తా 50కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో(New Delhi) ఇవాళ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీ చరిత్రలోనే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయ్యింది. మంగేష్ఫూర్ ప్రాంతంలో 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంగళవారం నాడు 49.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాత్రి సమయంలోనూ 30 డిగ్రీల కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


రికార్డ్ స్థాయికి చేరిన విద్యుత్ వినియోగం..

దేశ రాజధాని ఢిల్లీలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు అక్కడి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. దీంతో నగరంలో విద్యుత్ వినియోగం కూడా రికార్డ్ స్థాయికి చేరుకుంది. వాస్తవానికి మునుపెన్నడూ ఈస్థాయిలో విద్యుత్ వినియోగం పెరగలేదు. చరిత్రలో మొదటి సారిగా ఈ ఏడాది ఢిల్లీ విద్యుత్ వినియోగం పెరిగింది. ఏకంగా న8,302 మెగావాట్లకు విద్యుత్ వినియోగం చేరుకుంది. వరుసగా ఏడు రోజుల నుంచి ఢిల్లీలో 7,000 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరుగుతోంది.

For More National News and Telugu News..

Updated Date - May 29 , 2024 | 05:59 PM