Share News

Delhi : ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన భేష్‌..!

ABN , Publish Date - Aug 25 , 2024 | 04:17 AM

ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీపై ప్రపంచ మీడియా సానుకూలంగా స్పందించింది. ‘యుద్ధంలో తలపడుతున్న ఇరు దేశాల మధ్య సమతూకంతో మోదీ వ్యవహరించారు’ అని న్యూయార్క్స్‌ టైమ్స్‌ పేర్కొంది.

Delhi :  ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన భేష్‌..!

న్యూఢిల్లీ, ఆగస్టు 24: ప్రధాని మోదీ ఉక్రెయిన్‌ పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీపై ప్రపంచ మీడియా సానుకూలంగా స్పందించింది. ‘యుద్ధంలో తలపడుతున్న ఇరు దేశాల మధ్య సమతూకంతో మోదీ వ్యవహరించారు’ అని న్యూయార్క్స్‌ టైమ్స్‌ పేర్కొంది.

‘యుద్ధం విషయంలో భారత్‌ ఎప్పుడూ తటస్థంగా లేదు. మొదట్నుంచీ మాది శాంతి పక్షమే’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను బీబీసీ హైలైట్‌ చేసింది. ‘మోదీ పర్యటన చరిత్రాత్మక ఘట్టం..’ అంటూ జెలెన్‌స్కీ చేసిన వ్యాఖ్యలను లె మొండే ప్రముఖంగా ప్రచురించింది.

1991లో ఉక్రెయిన్‌కు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశంలో పర్యటించిన తొలి భారత ప్రధాని మోదీయేనని అన్ని వార్తా సంస్థలు వెల్లడించాయి. పరస్పరం పోరాడుకుంటున్న రష్యా-ఉక్రెయిన్‌ దేశాల మధ్య శాంతిని నెలకొల్పేందుకు మోదీ చొరవ చూపినట్లు పేర్కొన్నాయి. తన పర్యటనల్లో ఇరు దేశాధినేతలు మోదీ ఆలింగనం చేసుకున్న విషయాన్ని ప్రముఖంగా ప్రచురించాయి.

Updated Date - Aug 25 , 2024 | 04:17 AM