Share News

యూపీలోని బహ్రాయీచ్‌లో తీవ్ర ఉద్రిక్తత

ABN , Publish Date - Oct 15 , 2024 | 04:18 AM

దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయీచ్‌ జిల్లాలో ఆదివారం జరిగిన మతపరమైన గొడవలో ఓ యువకుడు చనిపోయిన ఘటన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

యూపీలోని బహ్రాయీచ్‌లో తీవ్ర ఉద్రిక్తత

లఖ్‌నవూ, అక్టోబరు 14: దుర్గామాత నిమజ్జనం సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయీచ్‌ జిల్లాలో ఆదివారం జరిగిన మతపరమైన గొడవలో ఓ యువకుడు చనిపోయిన ఘటన సోమవారం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మన్సూర్‌ గ్రామంలో ఓ వర్గానికి చెందిన వందలాది మంది కర్రలు, ఇనుపరాడ్లు చేతబట్టుకొని వీరంగం సృష్టించారు. షాపులను ధ్వంసం చేశారు. ఓ ఆస్పత్రికి నిప్పు పెట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్జి చేశారు. టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారు. స్థానికంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. 30మందిని అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం దుర్గామాత నిమజ్జనం సందర్భంగా డీజే పాటలకు సంబంధించి ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. రెండు వర్గాల వాళ్లు ఘర్షణపడ్డారు. ఈ క్రమంలో ఓ వర్గం వారు కాల్పులు జరగ్గా అవతలి వర్గంలో వ్యక్తి చనిపోయాడు.

Updated Date - Oct 15 , 2024 | 04:18 AM