Share News

Devotees : హుండీలో ఫోన్‌ పడిందా.. కృష్ణార్పణమే!

ABN , Publish Date - Dec 22 , 2024 | 05:24 AM

‘పొరబాటైనా, ఏమరపాటైనా రూల్‌ రూలే...దేవుడి హుండీలో సెల్‌ఫోన్‌ దేవుడిదే..మీది కాదు’ అంటుండడంతో ఓ భక్తునికి గొప్ప చిక్కొచ్చి పడింది.

Devotees : హుండీలో ఫోన్‌ పడిందా.. కృష్ణార్పణమే!

  • దేవుని ఖాతాకే అంటున్న అధికారులు

  • ఖరీదైన ఫోనంటూ భక్తుని ఆవేదన

చెన్నై, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): ‘పొరబాటైనా, ఏమరపాటైనా రూల్‌ రూలే...దేవుడి హుండీలో సెల్‌ఫోన్‌ దేవుడిదే..మీది కాదు’ అంటుండడంతో ఓ భక్తునికి గొప్ప చిక్కొచ్చి పడింది. చెన్నై అంబత్తూరుకు చెందిన దినేష్‌ తన కుటుంబంతో గత ఆగస్టు మాసంలో చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూర్‌లో ఉన్న కందస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ సమయంలో ఆయన జేబులో ఉన్న ఖరీదైన ఐ ఫోన్‌ దేవాలయం హుండీలో పడిపోయింది. దీనిపై ఆలయ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. కాగా, గురువారం హుండీని లెక్కించిన అధికారులు.. ఆ ఫోన్‌ను ఇచ్చేది లేదని, అది ఇక దేవుడికే సొంతమంటూ తేల్చిచెప్పారు. ఆ ఫోన్‌లోని సిమ్‌కార్డ్‌, మెమొరీకార్డ్‌లను మాత్రం ఇచ్చారు. దీనిపై శనివారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు మాట్లాడుతూ.. హుండీలో పడిన ఏ వస్తువైనా దానిని ఆలయ భాండాగారంలో జమచేస్తారని, అది దేవుని ఖాతాకే చెందుతుందని తెలిపారు. హుండీలో పడినది దేవునికే చెందడం ఆలయ ఆచారమని, తిరిగి ఇవ్వాలని భక్తులు కోరడాన్ని నిబంధనలు అనుమతించవని వివరించారు. అయినా నిబంధనల్ని క్షుణ్ణంగా పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని అన్నారు.

Updated Date - Dec 22 , 2024 | 05:24 AM