Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం..అనంతనాగ్-రాజౌరీ ఎన్నికల తేదీ సవరణ
ABN , Publish Date - Apr 30 , 2024 | 09:12 PM
జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ (Anantnag-Rajouri) లోక్‌సభ ఎన్నికల తేదీపై ఈసీఐ (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన (Third phase) జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి (Sixth phase) మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
వాతావరణ ప్రతికూలత, కమ్యూనికేషన్, ప్రచారానికి ఏర్పడుతున్న అవాంతరాలు కారణంగా ఎన్నికల తేదీలో మార్పు చేయాలని జమ్మూకశ్మీర్‌లోని పలు రాజకీయాల పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 56 కింద ఎన్నికల తేదీని సవరించినట్టు ఆ ప్రకటనలో ఈసీఐ తెలిపింది.
Lok Sabha Elections 2024: తొలి విడతలో 66.14 శాతం, రెండో విడతలో 66.71.. ఈసీ ఫైనల్ లెక్క
పీడీపీ ఆక్షేపణ
కాగా, అనంత్‌నాగ్-రాజౌరీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పీడీపీ చీఫ్, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఈసీ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇది ప్రజామ్యాన్ని పూర్తిగా పరిహసించడమేనని అన్నారు. ఈసీ నిర్ణంయం వేలాది మంది ప్రజల ఓటింగ్ హక్కులను కాలరాయడమేనని ఆక్షేపణ తెలిపారు. దీనికి ముందు, అనంతనాగ్-రాజౌరీ ఎన్నికలను వాయిదా వేయనున్నట్టు వచ్చిన ఊహాగానాలపై ఈసీకి మెహబూబా ముఫ్తీ లేఖ రాశారు. ఎన్నికల తేదీని మార్చవద్దని కోరారు.
Read Latest National News and Telugu News