Arvind Kejriwal: మధ్యంతర బెయిలు పొడిగింపుపై కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. కేజీ బరువు పెరిగారని ఈడీ వాదన
ABN , Publish Date - Jun 01 , 2024 | 04:53 PM
సుప్రీంకోర్టు గత నెలలో మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ కోర్టు ఈనెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 2వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ లొంగిపోవడం అనివార్యం కానుంది.
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు (Supreme Corut) గత నెలలో మంజూరు చేసిన మధ్యంతర బెయిలును పొడిగించాలంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) పెట్టుకున్న దరఖాస్తుపై తీర్పును ఢిల్లీ కోర్టు ఈనెల 5వ తేదీకి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 2వ తేదీన తిరిగి తీహార్ జైలు అధికారుల ముందు కేజ్రీవాల్ లొంగిపోవడం అనివార్యం కానుంది.
ఆరోగ్య కారణాలు, వైద్య పరీక్షల రీత్యా ముందస్తు బెయిలు గడువును పొడిగించాలంటూ కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనతో విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విభేదించింది. తన ఆరోగ్యంపై ఆయన తప్పుడు ప్రకటనలు చేశారని కోర్టు దృష్టికి తెచ్చింది. తనను నిర్బంధంలోకి తీసుకున్నప్పటి నుంచి 6 కిలోల బరువు తగ్గానంటూ కేజ్రీవాల్ చేసిన 'పొలిటికల్ క్లెయిమ్'లో నిజం లేదని పేర్కొంది. పైగా ఒక కిలో బరువు పెరిగారని తెలిపింది. వైద్య పరీక్షలు చేయించుకోవడానికి బదులు దేశవ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారని కోర్టుకు విన్నవించింది. మధ్యంతర బెయిలును పొడిగించాలని కేజ్రీవాల్ కోరడంలో ఔచిత్యాన్ని కూడా ఈడీ ప్రశ్నించింది. రెగ్యులర్ బెయిల్ కోరే స్వేచ్ఛను సుప్రీం కోర్టు ఇచ్చిందే కానీ, మధ్యంతర బెయిల్‌ను పొడిగించమని కోరడానికి కాదని ఈడీ తరఫున కోర్టుకు హాజరైన అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్.వి.రాజు వాదించారు.
For Latest News and National News click here