Punjab bypolls: పంజాబ్‌లో 4 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
ABN , Publish Date - Oct 15 , 2024 | 05:10 PM
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్ లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల తేదీని ప్రకటించింది.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మంగళవారంనాడు ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఇదే సమయంలో పంజాబ్ (Punjab)లోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల (bypolls) తేదీని ప్రకటించింది. నవంబర్ 13న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 23న ఫలితాలను ప్రకటిస్తామని తెలిపింది. మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను కూడా ఇదే రోజున ప్రకటించనున్నారు.
Maharashtra, Jharkhand Elections: నవంబర్ 20న మహారాష్ట్ర, నవంబర్ 13, 20న జార్ఖాండ్ పోలింగ్
పంజాబ్‌లో ఉప ఎన్నికలు జరుగనున్న నాలుగు అసెంబ్లీ స్థానాల్లో డేరాబాబా నానక్, చబ్బేవాల్, గిదడ్బాహ, బర్నాలా నియోజవర్గాలు ఉన్నాయి. సుఖ్జిందర్ సింగ్ రాంధ్వా రాజీనామాతో డేరాబాబా నానక్‌లోనూ, డాక్టర్ రాజ్ కుమార్ రాజీనామాతో చబ్బెవాల్ నియోజకవర్గంలోనూ, అమరిందర్ సింగ్ రజా వారింగ్ రాజీనామాతో గిదడ్బాహలోనూ, గుర్మీత్ సింగ్ మీత్ హయర్ రాజీనామాతో బర్నాలాలోనూ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..
ఇది కూడా చదవండి..