Share News

Election Commission: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

ABN , Publish Date - Jan 29 , 2024 | 02:12 PM

రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది.

Election Commission: రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల, తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే?

ఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission Of India) సోమవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్ నెలలో ముగియనుంది. రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి 8వ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫిబ్రవరి 27వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 02:25 PM