Maharashtra, Jharkhand Elections: నవంబర్ 20న మహారాష్ట్ర, నవంబర్ 13, 20న జార్ఖాండ్ పోలింగ్
ABN , Publish Date - Oct 15 , 2024 | 04:10 PM
మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు.
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, జార్ఖాండ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే విడతలో పోలింగ్ జరుపనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ ప్రకటించారు. నవంబర్ 23న ఫలితాలు ప్రకటిస్తారు. గెజిట్ నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడుతుంది. నామినేషన్ల గడవు అక్టోబర్ 29వ తేదీతో ముగుస్తుంది. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 30న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 4వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ 25వ తేదీలోగా ఎన్నికలు ముగియాల్సి ఉంటుంది.
జర్ఖాండ్‌లో రెండు విడతలు
జార్ఖాడ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగనున్నట్టు సీఈసీ ప్రకటించారు. తొలి విడత నవంబర్ 13, రెండో విడత నవంబర్ 20న జరుగుతుంది. తొలి విడత ఎన్నికలకు అక్టోబర్ 18న నోటిఫికేషన్ వెలువడుతుంది. అక్టోబర్ 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్ 28న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అక్టోబర్ 30తో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగుస్తుంది. తొలి విడతలో భాగంగా 43 నియోజకవర్గాలకు నవంబర్ 13న పోలింగ్ జరుగుతుంది. రెండో విడత నోటిఫికేషన్ అక్టోబర్ 22న వెలువడుతుంది. అక్టోబర్ 29తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. అక్టోబర్ 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నవంబర్ 1వ తేదీతో ముగుస్తుంది. నవంబర్ 20న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 23న కౌంటింగ్ జరిపి ఫలితాలు ప్రకటిస్తారు.
కాగా, 288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీ గడువు నవంబర్ 26తో ముగుస్తోంది. ఈలోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 81 స్థానాలున్న జార్ఖాండ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 5వ తేదీతో ముగుస్తుంది. మహారాష్ట్రలో బిజీపీ, శివసేన, ఎన్‌సీపీతో కూడిన మహాయుతి ప్రభుత్వం అధికారంలో ఉండగా, జార్ఖాండ్‌లో జెఎంఎం అధికారంలో ఉంది.