Share News

Maharashtra: ఎన్నికల వేళ డీజీపీపై ఈసీ బదిలీ వేటు

ABN , Publish Date - Nov 04 , 2024 | 04:33 PM

విపక్షాల పట్ల డీజీపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడిలో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి వరుస ఫిర్యాదులు చేసింది. అక్రమ ఫోన్ టాపింగ్‌కు ఆమె పాల్పడ్డారంటూ గత నెలలో ఫిర్యాదు చేసింది.

Maharashtra: ఎన్నికల వేళ డీజీపీపై ఈసీ బదిలీ వేటు

న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ భారత ఎన్నికల సంఘ (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర డీజీపీ (DGP) రష్మి శుక్లా (Rashmi Shukla)పై ఈసీ బదిలీ వేటు వేసింది. గత ప్రభుత్వ హయాంలో విపక్ష నేతల ఫోన్లు టాప్ చేశారంటూ ఆమెపై ప్రతిపక్షాలు ఈసీకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ తాజా చర్యలు తీసుకుంది.

EC: 3 రాష్ట్రాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉపఎన్నికల తేదీ మార్పు


విపక్షాల పట్ల డీజీపీ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారంటూ మహా వికాస్ అఘాడి (MVA)లో కీలక భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈసీకి వరుస ఫిర్యాదులు చేసింది. అక్రమ ఫోన్ టాపింగ్‌కు ఆమె పాల్పడ్డారంటూ గత నెలలో ఫిర్యాదు చేసింది. రాష్ట్ర పోలీస్ చీఫ్‌ బాధ్యతల నుంచి రేష్మి శుక్లాను తొలగించాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ 24, అక్టోబర్ 4న కూడా ఇదే విషయమై లేఖలు రాసినట్టు అందులో తెలిపారు. పుణె పోలీసు అధికారిగా రేష్మి ఉన్నప్పుడు విపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేశారని కూడా పటోలే ఆరోపించారు. విపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించాలని సీపీలు, ఎస్‌పీలకు ఆమె ఆదేశిచ్చినట్టు కూడా తెలుస్తోందని రాజీవ్ కుమార్‌కు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు.


ఈ క్రమంలో డీజీపీని తొలగిస్తూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆమె తదుపరి అర్హత కలిసిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల పేర్లను పంపించాలని రాష్ట్ర చీఫ్ సెక్రటరీని ఈసీ ఆదేశించారు. 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీకి నవంబర్ 20న పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో డీజీపీపై బదిలీ వేటు పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఇది కూడా చదవండి..

Bus Accident: ఉత్తరాఖండ్‌లో ఘోర బస్సు ప్రమాదం.. ఏడుగురు మృతి

IRCTC: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టికెట్‌ బుకింగ్‌, ట్రాకింగ్‌ కోసం ఐఆర్‌సీటీసీ సూపర్‌ యాప్‌..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Nov 04 , 2024 | 04:33 PM