Share News

Jairam Ramesh: 'ఇండియా' కూటమి పీఎం అభ్యర్థి ఎంపికపై జైరామ్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN , Publish Date - May 22 , 2024 | 05:56 PM

బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీపై 'ఇండియా' కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ బుధవారంనాడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇదేమీ వ్యక్తుల మధ్య 'బ్యూటీ కాంటెస్ట్' కాదన్నారు.

Jairam Ramesh: 'ఇండియా' కూటమి పీఎం అభ్యర్థి ఎంపికపై జైరామ్ రమేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి నరేంద్ర మోదీ (Narendra Modi)పై 'ఇండియా' (I.N.D.I.A.) కూటమి తరఫున ప్రధాని అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ (Jairam Ramesh) బుధవారంనాడు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు. ఇదేమీ వ్యక్తుల మధ్య 'బ్యూటీ కాంటెస్ట్' కాదన్నారు. జూన్ 4వ తేదీన ఎన్నికల తీర్పు వెలువడిన కొద్ది గంటల్లోనే ప్రధానమంత్రి అభ్యర్థిని ఎన్నుకుంటామని చెప్పారు. ఏకాభిప్రాయంతోనే ప్రధానమంత్రిని 'ఇండియా' కూటమి ఎన్నుకుంటుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రకటించిన మరుసటి రోజే జైరామ్ రమేష్ తాజా వ్యాఖ్యలు చేశారు.


ఖర్గే ఏమన్నారు?

జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడగానే 26 భాగస్వామ్య పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసి ఏకాభిప్రాయంతో ప్రధానమంత్రిని ఎన్నుకుంటామని మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. 2004లో యూపీఏ ప్రభుత్వం అనుసరించిన ప్రక్రియనే తాము పాటిస్తామని చెప్పారు.

Election Commission: గాడితప్పుతున్న ప్రసంగాలపై ఈసీ ఆగ్రహం.. బీజేపీ, కాంగ్రెస్‌ అధ్యక్షులకు నోటీసులు


రెండు గంటలు చాలు...

కాగా, 2004లో ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ పేరును ప్రకటించడానికి నాలుగు రోజులు పట్టిందని జైరామ్ రమేష్ తెలిపారు. ఈసారి రెండు రోజులకు మించి పట్టకపోవచ్చని, కొద్ది గంటల్లోనే పేరుపై నిర్ణయం ఉండొచ్చని చెప్పారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉండొచ్చా అనే ప్రశ్నకు, అతిపెద్ద పార్టీ తరఫు అభ్యర్థి ప్రధాని కావడం అనే ఫార్ములాను అనుసరించవచ్చన్నారు.


ఐదేళ్లు..ఐదుగురు పీఎంలా?

'ఇండియా' కూటమి ప్రధాని అభ్యర్థిని ప్రకటించకుండా ఎన్నికలకు వెళ్లడంపై నరేంద్ర మోదీ ఇటీవల వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐదేళ్లలో ఐదుగురు ప్రధానులకు విపక్ష కూటమి ప్లాన్ చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే, ఆయన వాదనను మల్లికార్జున్ ఖర్గే తోసిపుచ్చారు. యూపీఏ కూడా గతంలో వివిధ పార్టీల కూటమిగా ఉందని, ఒకే ప్రధానితో ఐదేళ్లు పాలన సాగించిందని గుర్తు చేసారు. యూపీఏ-1, యూపీఏ-2 హయంలో భాగస్వామ్య పార్టీల మద్దతుతో పూర్తి కాలం పాలన సాగించామన్నారు. 10 ఏళ్ల పాటు మన్మోహన్ సింగ్ దేశాన్ని పాలించారని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - May 22 , 2024 | 05:56 PM