Share News

Fali S Nariman: సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత

ABN , Publish Date - Feb 21 , 2024 | 09:06 AM

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూశారు. ఆయన బుధవారం ఢిల్లీలో 95 సంవత్సరాల వయస్సులో తుది శ్వాస విడిచారు.

Fali S Nariman: సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ కన్నుమూత

భారత ప్రఖ్యాత న్యాయనిపుణుడు, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఫాలి ఎస్ నారిమన్ (95)(Fali S Nariman) బుధవారం కన్నుమూశారు. ఢిల్లీలో తుది శ్వాస విడిచారు. నారిమన్‌కు న్యాయవాదిగా 70 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. నారిమన్ 1950లో మొదట బాంబే హైకోర్టు నుంచి న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 1961లో సీనియర్ అడ్వకేట్‌గా ఎంపికయ్యారు. 70 ఏళ్ల పాటు న్యాయవాద వృత్తిని చేపట్టారు. 1972లో సుప్రీంకోర్టు(Supreme Court)లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. దీని తర్వాత ఆయన భారత అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమితులయ్యారు. నారిమన్ తన విశేష కృషికి జనవరి 1991లో పద్మభూషణ్, 2007లో పద్మవిభూషణ్ అవార్డులు కూడా అందుకున్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: Farmers Protest: నేడు ఉదయం 11 వరకు కేంద్రానికి డెడ్‌లైన్.. లేదంటే మళ్లీ రైతుల నిరసన


నారిమన్‌ సీనియర్ న్యాయవాదితో పాటు, 1991 నుంచి 2010 వరకు బార్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో పాటు అతను అంతర్జాతీయ స్థాయిలో కూడా పనిచేశారు. నారిమన్ 1989 నుంచి 2005 వరకు ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ వైస్-ఛైర్మెన్‌గా ఉన్నారు. అతను 1995 నుంచి 1997 వరకు జెనీవాలోని ఇంటర్నేషనల్ కమిషన్ ఆఫ్ జ్యూరిస్ట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీకి ఛైర్మన్‌గా కూడా పనిచేశారు.

నారీమన్ మృతి పట్ల సుప్రీంకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ సంతాపం వ్యక్తం చేశారు. నారిమన్‌ను గుర్తు చేసుకుంటూ, "మానవ తప్పిదాలకు గుర్రపు వ్యాపారం అనే పదాన్ని ఉపయోగించడం గుర్రాలను అవమానించడమేనని నారిమన్ అన్నారు" అని పేర్కొన్నారు. ఆయన (నారిమన్) చరిత్రలోని లోతైన రహస్యాలను ఆవిష్కరిస్తూ, మాట్లాడేటప్పుడు, వాటిని తన జ్ఞానంతో సాటిలేని విధంగా అనుసంధానించేవారని గుర్తు చేసుకున్నారు. దీంతోపాటు పలువురు ప్రముఖులు నారిమన్ మృతి పట్ల సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.

Updated Date - Feb 21 , 2024 | 10:50 AM